Sakshi News home page

జగన్‌ స్పీక్స్‌ : చదువుల విప్లవం తెస్తా 

Published Mon, Feb 5 2018 7:36 PM

YS Jagan Speaks On Educational Reforms - Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చదువుల విప్లవం ఆవశ్యకతపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‘జగన్‌ స్పీక్స్‌’ద్వారా సోషల్‌మీడియాలో వీడియోను విడుదల చేశారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించే వ్యూహాలపై జగన్‌ స్పీక్స్‌ ద్వారా ఆయన ప్రజలను చేరుకుంటున్నారు.

అందులో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిరాభివృద్ధి కొరకు చదువుల విప్లవంపై వీడియోను విడుదల చేశారు. సాంకేతిక విద్యకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముష్టి వేస్తుందని, ఉత్తమ విద్యను అందించే కళాశాల్లో ఫీజులు రూ. లక్ష వరకూ ఉంటున్నాయని అన్నారు. 

ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా సరైన సమయానికి అందటం లేదని విద్యార్థులు వాపోతున్నారని చెప్పారు. తక్కువ ఫీజును రీయింబర్స్‌ చేస్తే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారని ప్రశ్నించారు. చదువుల విప్లవాన్ని తీసుకురావాలని, అది కచ్చితంగా విజయవంతం అవుతుందని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ చెప్పారు. 

చదువుల విప్లవంపై వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారో కింది వీడియోలో తిలకించొచ్చు.

Advertisement

What’s your opinion

Advertisement