పప్పుగారి బాధ్యతే ఆయన బాధ్యతా? : వైఎస్‌ షర్మిల | Sakshi
Sakshi News home page

పప్పుగారి బాధ్యతే ఆయన బాధ్యతా? : వైఎస్‌ షర్మిల

Published Thu, Apr 4 2019 5:34 PM

YS Sharmila At Unguturu Constituency - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఇంటికో జాబు అన్నారు.. రైతు, డ్వాక్రా రుణమాఫీలు అన్నారు ఇన్నాళ్లు గుర్తుకు రాని ప్రజలు మళ్లీ ఇప్పుడు గుర్తుకువచ్చారని.. ఈ ఐదేళ్లలో గుర్తుకు రాని బాధ్యత ఇప్పుడు గుర్తుకు వచ్చిందని.. పప్పుగారి బాధ్యతే ఆయన భాద్యతా అంటూ వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడ్డాయని టీడీపీ నేతలు ఇంటికి వస్తారని తమకు ఓటేయండి అని అడుగుతారని అంటూ.. ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం బాకీ పడ్డ సొమ్ముపై నిలదీయండి అని అన్నారు. ఆమె ఉంగుటూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ.. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌ను, ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

అది ఒక్క వైఎస్సారే..
ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రసంగిస్తూ.. ‘రాజశేఖర్‌ రెడ్డి గారు ఐదేళ్లు పాలించారు. ఆయన పాలనలో ప్రతి పేదవాడు, మహిళ, విద్యార్థులు అందరికీ సంక్షేమాలు అందాయి. ఆరోగ్య శ్రీతో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ప్రతి ఎకరాకి నీరు అందాలని, అందరికీ పక్కా ఇళ్లు ఉండాలని పాలన అందించారు. ఐదేళ్లలో ఏ ఒక్క పైసా పన్ను పెంచకుండా పాలన అందించిన రికార్డు మహానేతదే. ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అని కూడా అడగలేదు. ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అంటే అది ఒక్క వైఎస్సారే’ అని అన్నారు.



ఆరోగ్య శ్రీ నుంచి కార్పోరేట్‌ ఆస్పత్రులు తీయించారు..
‘అవినీతి, అరాచకానికి, మోసానికి ప్రతీకగా చంద్రబాబు పాలిస్తున్నారు. రైతుల రుణమాఫీపైనే మొదటి సంతకం అన్నారు.. మొదటి సంతకానికే దిక్కులేకుండా పోయింది. డ్వాక్రా రుణ మాఫీలు అన్నారు.. ఏ ఒక్కరికైనా జరిగిందా.. ఇప్పుడొచ్చి పసుపు-కుంకుమ అంటూ డబ్బులు ఇస్తున్నారు. వారు ఇచ్చే డబ్బు కనీసం వడ్డీకైనా సరిపోతుందా? మహిళలను చంద్రబాబు ఘోరంగా వంచించాడు. విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌.. అన్నాడు ఏ ఒక్కరికైనా అందిందా? ఆరోగ్యశ్రీ నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులను తీయించారు. వారికి ఏదైనా జరిగితే.. కార్పోరేట్‌ ఆస్పత్రులకు, సాధారణ జనాలు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలట’ అని అన్నారు.

చెవిలో పూలు, క్యాబేజీలు పెడుతున్నారు..
‘కమీషన్లు దన్నుకోవడానికి పోలవరం అంచనాలు పెంచేశారు. చంద్రబాబు నిజంగా మాట మీద నిలబడుటుంటే.. ఈపాటికే పోలవరం పూర్తి అయి ఉండేది కాదా? హైదరాబాద్‌ను తానే కట్టానని, అమరావతిని కూడా తానే కడతానని ప్రగల్భాలు పలికాడు.. కనీసం ఒక్క ఫ్లై ఓవర్‌, పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టాడా.. మన చెవిలో పూలు, క్యాబేజీలు పెట్టేందుకు మళ్లీ వస్తున్నారు. బాబు వస్తే.. జాబు అన్నాడు. కానీ జాబు ఎవరికి వచ్చింది. చంద్రబాబు కొడుకు లోకేష్‌ కు వచ్చింది. ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి తేడా తెలీదు.. అఆ కూడా రావుగానీ అగ్రతాంబూలం కావాలట. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు.. అయినా ఆయన కొడుక్కు మూడు ఉద్యోగాలు ఇస్తారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా?’ అని ప్రశ్నించారు.

అందుకే రెండు వేళ్లను ఊపుతారు..
ఏపీకి ప్రత్యేకో హోదా ఊపిరిలాంటింది. హోదా ఇవ్వరని బీజేపీ చెప్పినా.. టీడీపీ నాలుగేళ్లు సంసారం చేసింది. మొదట ప్రత్యేక హోదా కావాలన్నారు.. అటు తర్వాత కమీషన్ల కోసం ప్యాకేజీ కావాలన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి.. అందుకే ఆయన ఎప్పుడూ రెండు వేళ్లను ఊపుతూ ఉంటారు. చంద్రబాబుది రోజుకో మాట పూటకో వేషం.. ఈయన మాటలు చూస్తే.. ఊసరవెళ్లి కూడా పారిపోతుంది. హోదా కోసం జగన్‌ ధర్నాలు, పోరాటాలుచేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు కూడా రాజీనామా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలి. జగనన్న ఇంత చేస్తే.. చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌తీసుకుని హోదా కావాలని అడుగుతున్నారు.




నమాజ్‌ కోసం ప్రసంగాన్ని మధ్యలో ఆపిన షర్మిల
షర్మిల సభకు హాజరైన అశేష అభిమాన గణం.. తమ ప్రియతమ నాయకుడు వైఎస్‌ జగన్‌పై తమ ప్రేమను తెలియజేశారు. సీఎం సీఎం సీఎం.. అంటూ ప్రజలు అరుస్తూ.. ఉంటే.. షర్మిల కూడా ‘కాబోయే సీఎం యెడుగూరి సందింటి జగన్’ అని నినదించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు‌. షర్మిలప్రసంగిస్తున్న సమయంలో నమాజ్‌ ప్రారంభం కాగా కాసేపుతన ప్రసంగానికి విరామాన్ని ఇచ్చారు. అనంతరం మళ్లీ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. చంద్రబాబు ఎప్పటికీ నిజంచెప్పరు.. ఏ రోజైతే చంద్రబాబు ఒక్క నిజంచెబుతారో.. ఆ రోజు ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుంది. హరికృష్ణ శవం పక్కన ఉండగా.. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించిన చంద్రబాబు.. నేడు వైఎస్సార్‌సీపీకి టీఆర్‌ఎస్‌, బీజేపీతో పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. సింహం సింగిల్‌గానే వస్తుంది. దేశంలోని అన్ని సర్వేలు వైఎస్సార్‌సీపీ బంపర్‌మెజార్టీని సాధిస్తుందని చెబుతున్నాయి. ప్రతి విషయంలో మీకు అండగా ఉంటాం. మళ్లీ రాజన్నరాజ్యం రావాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. ఓటు వేసే సమయంలో రాజన్నను ఒక్కసారి తలచుకోండి. ఆయన కొడుక్కి మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి’ అంటూ ప్రజలను కోరారు.



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement