వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి

Published Thu, Nov 9 2017 9:18 AM

YSRCP announced New presidents in kurnool - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, బీవై రామయ్య అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా భావించి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నూతన అధ్యక్షులను నియమించిన విషయం విదితమే. బుధవారం గౌరు వెంకటరెడ్డి నివాసంలో నూతన అధ్యక్షులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన గౌరు వెంకటరెడ్డి వీడ్కోల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న జిల్లాలు బ్రిటీషు కాలం నాటి లెక్కలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే ఉండడంతో పరిపాలన సౌలభ్యానికి ఇబ్బందిగా మారుతోందన్నారు. పది లక్షల జనాభాకు ఒక జిల్లా ఉండాలనే సంకల్పంతో నంద్యాల ఉపఎన్నికల్లో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామన్న హామీ ఇచ్చారన్నారు. అందుకు అనుగుణంగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరంగా నూతన జిల్లా ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్, 11 అసెంబ్లీ, జెడ్పీ చైర్మన్‌తోపాటు పలు మునిసిపాలిటీలను వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకోవడంలో గౌరు వెంకటరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. మున్ముందు ఆయ న సేవలుఎంతో అవసరమని చెప్పారు.  

సలహాలు, సూచనలు స్వీకరిస్తాం..
శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ..పార్టీ అధ్యక్షుడు తనపై ఉంచిన నమ్మకాన్ని పార్టీని బలోపేతం చేసి నిలబెట్టుకుంటానన్నారు. నం ద్యాల పార్లమెంట్‌లోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. పార్టీలో ఎవరూ చేరినా స్వాగతిస్తానని, అందరిని సమన్వయం తో పనిచేస్తూ తాను చేస్తానని ముందుం టాన్నారు. గౌరు వెంకటరెడ్డి తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయుడని, ఆయన సలహాలు, సూచనలను స్వీకరిస్తాన్నారు. 

గెలుపే లక్ష్యం..
బీవై రామయ్య మాట్లాడుతూ..365 రోజులు..24 గంటలు పార్టీ కోసం పని చేస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలసి పనిచేస్తానని, పార్టీ బలోపేతం కోసం ఎవరూ సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో సమష్టి నిర్ణయాలతో కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని స్థానాల్లో గెలుపు కోసం ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారు.

సహకారం మరువలేనిది..
గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ...2014 ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించిన సహకారం మరువలేన్నారు. ఎవరైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యే వరకు పార్టీలో ఏ బాధ్యతలు ఇచ్చినా తీసుకుంటానన్నారు. పార్టీ బలోపేతంకోసం తనవంతు సేవలను కొనసాగిస్తానని చెప్పారు. 

Advertisement
Advertisement