నేనూ మోదీకే ఓటేస్తా.. కానీ.. | Sakshi
Sakshi News home page

నటికి కౌంటర్‌ ఇచ్చిన నెటిజన్‌

Published Sat, Apr 6 2019 8:35 PM

Koena Mitra Tweet On Rahul Rally Went Wrong And Had A Correction - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌లో నామినేషన్‌ వేసిన సందర్భంగా అక్కడ ముస్లిం జెండాలు రెపరెపలాడాయంటూ యూపీ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముస్లిం లీగ్‌ను ఓ వైరస్‌గా అభివర్ణించిన ఆయన.. ఆ వైరస్‌ సోకిన కాంగ్రెస్‌ గెలిస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఆలోచించాలంటూ ట్వీట్‌ చేశారు. ఇక అప్పటి నుంచి యోగికి మద్దతుగా పలువురు నెటిజన్లు రాహుల్‌ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి కియోన మిత్ర..‘ ఉగ్రవాది జిన్నా కారణంగా మొదటిసారి దేశ విభజన జరిగింది. ఇకపై రాహుల్‌ గాంధీ అందుకు కారణమవుతారేమో. కేరళలో ఇస్లాం జెండాలు ఎగరడం దేనికి నిదర్శనం. జిహాద్‌ను ప్రోత్సహించేలా, హిందుత్వాన్ని నాశనం చేసేలా.. భారత్‌, భారత సైనికులకు పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉంది. హిందువాదాన్ని నాశనం చేసేందుకు కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు.

చదవండి : (ముస్లింలీగ్‌ ఓ వైరస్‌ : యోగి ఆదిత్యనాథ్‌)

ఈ క్రమంలో ఆమె ముస్లిం లీగ్‌ ర్యాలీ(కేరళ మంత్రి పీకే కున్హలి కుట్టి 2016 నాటి ర్యాలీ) ఫొటోను తన ట్వీట్‌కు జతచేశారు. ఇందుకు స్పందించిన రైట్‌వింగ్‌ నాయకుడు రాహుల్‌ ఈశ్వర్‌.. ‘  డియర్‌ కియోనాజీ ఇది ముస్లింలీగ్‌ జెండా. దేశ విభజన సమయంలో మన జాతి వారసత్వాన్ని కొనసాగిస్తూ భారత్‌లోనే ఉండేందుకు కొంత మంది మొగ్గుచూపారు. వాళ్ల మన ముస్లిం సోదరులు.. జిన్నాను కాదని గాంధీ మార్గాన్ని ఎంచుకున్నారు. నేను కూడా మోదీజీకే ఓటు వేస్తా. కానీ ఓట్ల కన్నా నిజాలు మరింత ముఖ్యం కదా’ అంటూ హితవు పలికారు.

Advertisement
Advertisement