కుర్రాళ్లు లెక్క సరిచేశారు | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లు లెక్క సరిచేశారు

Published Thu, Feb 2 2017 1:04 AM

కుర్రాళ్లు లెక్క సరిచేశారు

ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుపై భారత్‌ ఘన విజయం
ముంబై: బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లు కూడా రాణించడంతో... ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత అండర్‌–19 జట్టు 129 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలి వన్డేలో 23 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్‌ రెండో మ్యాచ్‌లో నెగ్గి ఐదు వన్డేల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. ఓపెనర్‌ హిమాన్షు రాణా (66 బంతుల్లో 58; 10 ఫోర్లు), హార్విక్‌ దేశాయ్‌ (62 బంతుల్లో 75; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా...

కమలేశ్‌ నాగర్‌కోటి (32 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (24), అభిషేక్‌ శర్మ (24) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మాథ్యూ ఫిషర్‌ నాలుగు, హెన్రీ బ్రూక్స్‌ మూడు వికెట్లు తీశారు. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు భారత బౌలర్ల ధాటికి 33.4 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. రాలిన్స్‌ (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడినా... మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. భారత్‌ తరఫున స్పిన్నర్‌ అనుకూల్‌ రాయ్‌ మూడు వికెట్లు పడగొట్టగా... శివమ్, ఇషాన్‌ పోరెల్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. సిరీస్‌లోని మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement