మెస్సీ మళ్లీ రా..! | Sakshi
Sakshi News home page

మెస్సీ మళ్లీ రా..!

Published Mon, Jul 4 2016 2:30 AM

argentines rally to urge messi to return to national team

అభిమానుల ర్యాలీ
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ రిటైర్ కావడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తను తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటూ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. కోపా అమెరికా కప్ ఫైనల్లో జట్టు ఓడిపోగానే మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు, ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా సహా పలువురు ప్రముఖులు మెస్సీని మళ్లీ బరిలోకి దిగాలని ఇప్పటికే కోరారు.

Advertisement
Advertisement