ఆర్థ, ఆర్యన్స్‌ గెలుపు | Sakshi
Sakshi News home page

ఆర్థ, ఆర్యన్స్‌ గెలుపు

Published Fri, Jan 27 2017 10:28 AM

artha, arayans teams won second game

ఐటీ క్రికెట్‌ లీగ్‌  


సాక్షి, హైదరాబాద్‌: బీఎన్‌ఐ కార్పస్‌ ఐటీ క్రికెట్‌ లీగ్‌లో రెండోరోజు ఆర్థ, ఆర్యన్స్‌ జట్లు గెలుపొందాయి. ఆస్కార్‌ నవాబ్స్‌ జట్టుతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్థ జట్టు 90 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్థ జట్టు 6 ఓవర్లలో 180 పరుగులు చేసింది. విజయ్‌ (78) టాప్‌ స్కోరర్‌. మనీశ్‌ (37) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో జీత్‌ 2 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం ఆస్కార్‌ నవాబ్స్‌ జట్టు 90 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కునాల్‌ (24) పర్వాలేదనిపించాడు. ఆర్థ జట్టు బౌలర్లలో ఫయాజ్‌ 3 వికెట్లు పడగొట్టగా... మనీశ్, గణేశ్‌ చెరో 2 వికెట్లు తీశారు. జువెల్స్‌ జట్టుతో జరిగిన మరో లీగ్‌ మ్యాచ్‌లో ఆర్యన్స్‌ జట్టు 27 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్యన్స్‌ జట్టు 5 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ప్రతీక్‌ (99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అజయ్‌ (31) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో నకుల్, సుచిత్‌ తలా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 188 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన జువెల్స్‌ జట్టు 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే ఆలౌటైంది. నకుల్‌ (66) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆర్యన్స్‌ బౌలర్లలో వికాస్‌ 3, ప్రతీక్‌ 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో రాణించిన ప్రతీక్‌ నహర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా నిలిచాడు.

 

Advertisement
Advertisement