బంగ్లా దెబ్బకు సఫారీలు కుదేలు | Sakshi
Sakshi News home page

బంగ్లా దెబ్బకు సఫారీలు కుదేలు

Published Wed, Jul 15 2015 10:46 PM

బంగ్లా దెబ్బకు సఫారీలు కుదేలు

చిట్టగాంగ్: బంగ్లాదేశ్ దెబ్బకు సఫారీలు కుదేలు అయ్యారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య  బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికా జట్టుపై బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 83 బంతులు మిగిలి ఉండగానే బంగ్లా మూడు వన్డేల  సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. సఫారీలు నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 26.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ ఆటగాడు సౌమ్య సర్కార్ 75 బంతుల్లో (13 ఫోర్లు, 1 సిక్స్) 90 పరుగులు చేశాడు. అనంతరం ఇమ్రాన్ తహీర్ బౌలింగ్లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలీయన్ చేరాడు. లితన్ దాస్ 5, తమీమ్ ఇక్బాల్ 61 పరుగులతో నాటౌట్గా నిలిచారు. కాగా, సఫారీ బౌలర్ ఇమ్రాన్ తహీర్ ఒక వికెట్ తీసుకున్నాడు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేశారు. సఫారీ ఆటగాడు డుమినీ 51 పరుగులు, డేవిడ్ మిల్లర్ 44 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు కాక్ 7, ఆమ్లా 15, ప్లెసెస్ 6, బెహారడియన్ 12 పరుగులు చేశారు. రాబ్దా, అబట్టా మెర్కేల్ సింగల్ డిజెట్కే పరిమితమైయ్యారు. బంగ్లా ఆటగాళ్లు రహమాన్, రుబెల్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, షకీబ్ మూడు వికెట్లను తన ఖాతలో వేసుకున్నాడు. మెర్తాజా, మహ్మదుల్లా తలో వికెట్ తీసుకున్నారు.

Advertisement
Advertisement