Sakshi News home page

ప్రేయసితో ఉంటున్న చాంపియన్ ఆకస్మిక మృతి

Published Fri, Feb 9 2018 4:50 PM

Commonwealth Games javelin champion Jarrod Bannister died - Sakshi

మెల్‌బోర్న్: న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ చాంపియన్ (2010), జావెలిన్ త్రోయర్ జర్రోడ్ బన్నిస్టర్ (33) ఆకస్మికంగా మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అథ్లెటిక్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం  యూరప్‌లోని నెదర్లాండ్స్‌లో తన ప్రేయసితో కలిసి ఉంటున్న జర్రోడ్ అకాల మరణం చెందాడని తమకు సమాచారం అందినట్లు ఆసీస్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వివరించింది.

2008లో బ్రిస్బేన్‌లో జరిగిన అథ్లెటిక్స్‌లో భాగంగా 89.02 మీటర్లు జావెలిన్ విసిరి రికార్డు సృష్టించాడు జర్రోడ్. 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణాన్ని కొల్లగొట్టాడు. 18 నెలల్లో మూడుసార్లు డోపిండ్ టెస్టులకు హాజరుకాలేదన్న కారణంగా 2013లో 20 నెలలపాటు నిషేధం విధించారు. నిషేధం అనంతరం పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని పతకాలు సాధించాడు ఈ ఆసీస్ అథ్లెట్.

జర్రోడ్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నా. టాలెంటెడ్ ప్లేయర్‌ను కోల్పోయామంటూ వరల్డ్, ఒలింపిక్ హర్డిల్స్ ఛాంపియన్ సాలీ పియర్‌సన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కెరీర్‌పై దృష్టిపెట్టిన ఈ జావెలిన్ త్రోయర్ శిక్షణ కోసం యూరప్‌ వెళ్లాడు. ప్రేయసితో కలిసి నెదర్లాండ్స్‌లో ఉంటున్న జర్రోడ్ ఈ క్రమంలో అకస్మాత్తుగా మృతిచెందాడు. అతడి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్థానిక అధికారులు తమకు చెప్పినట్లు ఆస్ట్రేలియా అథ్లెటిక్స్ అసోసియేషన్ వివరించింది.


2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన అనంతరం జర్రోడ్ బన్నిస్టర్ 
 

Advertisement
Advertisement