ధావన్‌ గోల్డెన్‌ డక్‌ | Sakshi
Sakshi News home page

ధావన్‌ గోల్డెన్‌ డక్‌

Published Sat, Mar 2 2019 5:59 PM

Dhawan falls early in 237 chase - Sakshi

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. భారత్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ తాను ఆడిన తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. దాంతో గోల్డెన్‌ డక్‌గా నిష్ర్రమించాడు. ఆసీస్‌ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ,-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. అయితే కౌల్టర్‌ నైల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి బంతిని ధావన్‌ షాట్‌ ఆడబోయాడు. అది పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మ్యాక్స్‌వెల్‌ చేతిలో పడటంతో ధావన్‌ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు.

అంతకుముందు ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.  ఆస్ట్రేలియా టాపార్డర్‌ ఆటగాళ్లలో ఉస్మాన్‌ ఖవాజా(50), మ్యాక్స్‌వెల్‌(40), స్టోయినిస్‌(37)లు రాణించగా, చివర్లో చివర్లో కౌల్టర్‌ నైల్‌(28), అలెక్స్‌ క్యారీ(36 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

ఇక్కడ చదవండి(‘వంద’లో సున్నా..!)

టీమిండియా లక్ష్యం 237

Advertisement
Advertisement