Sakshi News home page

కొలంబో టెస్టు.. భారత్ భారీ విజయం

Published Mon, Aug 24 2015 12:38 PM

కొలంబో టెస్టు.. భారత్ భారీ విజయం - Sakshi

కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత్ 278 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీకిదే తొలి విజయం. లంకతో మూడు టెస్టుల సిరీస్లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ చివరి రోజు సోమవారం 413 పరుగుల లక్ష్యసాధన బరిలో దిగిన లంక 134  పరుగులకు ఆలౌటైంది. 72/2 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు సోమవారం లక్ష్యసాధనకు దిగిన లంక పరుగు కూడా చేయకుండానే వికెట్ కోల్పోయింది. భారత పేసర్ ఉమేష్ యాదవ్.. లంక కెప్టెన్ మాథ్యూస్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత చండీమల్, తిరుమన్నె వెంటవెంటనే అవుటవగా.. ముబారక్, దమ్మిక ప్రసాద్ పరుగుల ఖాతా తెరవకనే పెవిలియన్ బాటపట్టారు. చమీరను మిశ్రా పెవిలియన్ చేర్చడంతో టీమిండియా విజయం ఖాయమైంది. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (5/42) సూపర్ స్పెల్తో రాణించాడు. అమిత్ మిశ్రా మూడు వికెట్లు తీశాడు.  టీమిండియా రెండో ఇన్నింగ్స్ను 325/8 వద్ద డిక్లేర్ చేయగా.. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 393, లంక 306 పరుగులు చేశాయి.

Advertisement

What’s your opinion

Advertisement