కబడ్డీ... కబడ్డీ | Sakshi
Sakshi News home page

కబడ్డీ... కబడ్డీ

Published Sat, Jul 18 2015 6:22 PM

కబడ్డీ... కబడ్డీ

*నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్   
 *తొలి మ్యాచ్‌లో ముంబై, జైపూర్ పోరు

ముంబై: భారత గ్రామీణ క్రీడగా పేరు తెచ్చుకున్న కబడ్డీని మరింత పాపులర్ చేసేందుకు... ఐపీఎల్ తరహాలో గతేడాది ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అందరి అంచనాలకు భిన్నంగా సూపర్ సక్సెస్ అయిన పీకేఎల్ తాజాగా నేటి (శనివారం) నుంచి రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. ముంబైలోని ఎన్‌ఎస్‌సీఐ స్టేడియంలో ముంబైకి చెందిన యు ముంబా, డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.
 
 ఆగస్టు 23న ఫైనల్ జరుగుతుంది.  పీకేఎల్‌లో తెలుగు టైటాన్స్ జట్టు కూడా కూడా ఉంది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఆరు గెలిచి ఐదు ఓడి ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచింది. ఈసారి తమ బేస్‌ను వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు మార్చుకుని బరిలోకి దిగుతోంది.
 
 విశేషాలు: ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టాన్, తెలుగు టైటాన్స్ పేరిట ఎనిమిది జట్లు పాల్గొంటాయి.
 
 తొలి సీజన్ ఫైనల్లో యు ముంబా జట్టును ఓడించి జైపూర్ విజేతగా నిలిచింది. ఇండోర్ స్టేడియాల్లో సింథటిక్ మ్యాట్‌పై మ్యాచ్‌లు జరుగుతాయి తొలి అంచె పోటీలు నేటి నుంచి 22 వరకు ముంబైలో జరుగుతాయి. ఆతిథ్య జట్టు ముంబై ఒక్కో ప్రత్యర్థితో మ్యాచ్ చొప్పున ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది.
 
 అనంతరం పోటీలు బెంగాల్ వారియర్స్ వేది కైన కోల్‌కతాకు మారుతాయి. ఇలా జట్లు ఉ న్న నగరాన్నింటిలో మ్యాచ్‌లు జరుగుతాయి. పీకేఎల్ విజేతకు రూ. 1 కోటి దక్కుతుంది. రన్నరప్‌కు రూ.50 లక్షలు, మూడో స్థానం జట్టుకు రూ.30 లక్షలు, నాలుగో స్థానం జట్టుకు రూ. 20 లక్షలు ఇస్తారు పీకేఎల్ టైటిల్ సాంగ్‌ను పాడిన బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు జాతీయగీతాన్ని ఆలపించనున్నారు.

Advertisement
Advertisement