Sakshi News home page

తొలి మ్యాచ్ కు మైకేల్ క్లార్క్ దూరం

Published Thu, Feb 12 2015 10:51 AM

తొలి మ్యాచ్ కు మైకేల్ క్లార్క్ దూరం

మెల్ బోర్న్: ఊహించినట్టుగానే వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇందులో భాగంగానే నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షలో క్లార్క్ విఫలం చెందాడు. దీంతో ఇంగ్లండ్ తో అతను సేవలను కోల్పోతున్నట్లు కోచ్ డారెన్ లీమన్ ప్రకటించాడు.

 

ఇదిలా ఉండగా ఫిబ్రవరి 21వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే రెండో మ్యాచ్ కు క్లార్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని లీమన్ తెలిపాడు.  క్లార్క్ వేగంగా కోలుకుంటున్నందున కీలక మ్యాచ్ లకు వస్తాడని లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement

What’s your opinion

Advertisement