మా వాడికి అప్పుడే పెళ్లేంటి? | Sakshi
Sakshi News home page

మా వాడికి అప్పుడే పెళ్లేంటి?

Published Wed, Apr 9 2014 12:49 AM

మా వాడికి అప్పుడే పెళ్లేంటి?

ఇంకా వయసు రాలేదన్న కోహ్లి తల్లి
 న్యూఢిల్లీ: ఒకవైపు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో చక్కర్ల పుకార్లు... మరోవైపు ‘నన్ను పెళ్లాడవా’ అంటూ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అభ్యర్థనలు... ఇప్పుడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అమ్మాయిల కలల రాకుమారుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వివాహం విషయంలో 25 ఏళ్ల కోహ్లి ఆలోచనలేమిటో తెలియకపోయినా అతని తల్లి సరోజ్ మాత్రం తన స్పందన తెలియజేసింది.
 
 ఇప్పట్లో కోహ్లికి పెళ్లే చేసే ఆలోచనే లేదని, అతను ఇంకా చిన్న పిల్లోడు అని తేల్చి చెప్పేసింది. ‘విరాట్ పెళ్లికి ఇది తగిన వయసు కాదు. అందుకు చాలా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే అతను క్రికెట్‌లో ఎదుగుతున్నాడు. ప్రస్తుతం అతను ఆటపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలి. కనీసం నాలుగైదేళ్ల వరకు మా వాడికి పెళ్లి చేయబోం’ అని ఆమె స్పష్టం చేసింది. అనుష్కా వింటున్నావా..!
 

Advertisement
Advertisement