నాకైతే అనుమానమే లేదు: దినేశ్‌ కార్తీక్‌ | Sakshi
Sakshi News home page

నాకైతే అనుమానమే లేదు: దినేశ్‌ కార్తీక్‌

Published Thu, Apr 16 2020 5:42 PM

No Reason To Doubt Myself, Dinesh Karthik - Sakshi

న్యూఢిల్లీ: తన రీఎంట్రీపై టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఆశగా ఉన్నాడు. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో స్థానంపై దినేశ్‌ కన్నేశాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన కార్తీక్‌.. కనీసం టీ20 ఫార్మాట్‌లోనైనా చోటు సంపాదిస్తాననే ధీమాతో ఉన్నాడు. తన ప్రదర్శనపై పూర్తి నమ్మకంతో ఉన్న దినేశ్‌ కార్తీక్‌.. మరో కమ్‌ బ్యాక్‌ కోసం చూస్తున్నాడు. ‘ టీ20 ఫార్మాట్‌లో నా రికార్డు మెరుగ్గా ఉంది. వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నమెంట్‌కు సంబంధించి నేను ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోలేదు. కానీ ఆశల్ని వదులుకోలేదు. నా ప్రదర్శనపై నమ్మకంతో ఉన్నప్పుడు స్థానంపై అనుమానం ఎందుకు.  (వారిద్దరి కెప్టెన్సీలో చాలా పోలికలున్నాయి: జహీర్‌)

కానీ ఇప్పటికీ టీ20 ఫార్మాట్‌లో చోటు దక్కుతుందనే ఆశతోనే ఉన్నాను. నాకైతే నా ప్రదర్శనపై అనుమానమే లేదు. మూడు ఫార్మాట్లలో నా యావరేజ్‌ చూస్తే టీ20ల్లోనే బాగుంది. అలానే స్టైక్‌రేట్‌ కూడా మెరుగ్గా ఉంది. ఇది నన్ను గాయపరుస్తుందని అనుకోవడం లేదు. నేను ఎప్పుడూ దేశం కోసం ఆడాలనే కోరికతోనే ఉన్నా.  ఆ కోరిక ఒక్కసారిగా తగ్గిపోదు కదా’ అని దినేశ్‌ కార్తీక్‌ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ దినేశ్‌ కార్తీక్‌ 26 టెస్టులు ఆడగా, 94 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. 32 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల్లో కార్తీక్‌ యావరేజ్‌ 33.25 ఉండగా, స్టైక్‌రేట్‌ 143.52గా ఉంది.

Advertisement
Advertisement