క్వార్టర్స్‌లో సింధు | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు

Published Fri, Dec 4 2015 12:05 AM

Saina, Sindhu static; Srikanth slips in BWF Rankings

మాలాంగ్ (ఇండోనేసియా): గతవారం మకావు ఓపెన్ టైటిల్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు... ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలోనూ దూసుకుపోతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సింధు 21-12, 21-9తో వులాన్ చాయా ఉతామి సుక్‌పుత్రి (ఇండోనేసియా)పై నెగ్గి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. కేవలం 24 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శించింది.
 
 ముఖ్యంగా రెండో గేమ్‌లో వరుస పాయింట్లతో హోరెత్తించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ఎనిమిదో సీడ్ గురుసాయిదత్‌లు ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్. ప్రణయ్‌కు నిరాశ ఎదురైంది. రెండోరౌండ్‌లో శ్రీకాంత్ 21-14, 17-21, 25-23తో సపుత్రా వికీ అనగా (ఇండోనేసియా)పై; గురుసాయిదత్ 21-19, 19-21, 21-15తో కియాన్ (సింగపూర్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 12-21, 22-20, 13-21తో షి యుకి (చైనా) చేతిలో ఓడాడు.
 

Advertisement
Advertisement