సౌరవ్ ఘోషాల్ కు సిల్వర్ మెడల్ | Sakshi
Sakshi News home page

సౌరవ్ ఘోషాల్ కు సిల్వర్ మెడల్

Published Tue, Sep 23 2014 11:53 AM

సౌరవ్ ఘోషాల్ కు సిల్వర్ మెడల్

ఇంచియాన్: ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ మేటి ఆటగాడు సౌరవ్ ఘోషాల్ వెండి పతకం గెల్చుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కువైట్ ఆటగాడు అబ్దుల్లా ఆల్మీజయేన్ చేతిలో  3-2 (12-10 11-2, 12-14, 8-1, 9-11) తో ఓడిపోయి వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు.

సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ సౌరవ్ 11-9, 11-4, 11-5తో ప్రపంచ 35వ ర్యాంకర్ బెంగ్ హీ (మలేసియా)పై గెలిచి రికార్డు సృష్టించాడు.

Advertisement
Advertisement