►తల్లి కాబోతున్న టెన్నిస్ స్టార్
►2017 సీజన్‌కు దూరం
►వచ్చే ఏడాది వస్తానని ప్రకటన
లాస్ ఏంజెల్స్: ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సోదరి వీనస్‌ను ఓడించి అత్యధిక గ్రాండ్‌స్లామ్ (23)ల విజేతగా సెరెనా విలియమ్స్ నిలిచిన క్షణాన్ని టెన్నిస్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. కానీ ఆ సమయంలో సెరెనా రెండు నెలల గర్భవతి అంటే ఆశ్చర్యం కలుగుతుంది! తాను గర్భవతినని తెలిసీ బరిలోకి దిగిన సెరెనా... టైటిల్ గెలిచే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా కనబర్చిన ఆట, పట్టుదల అద్భుతం. ఈ చిరస్మరణీయ విజయం తర్వాత మోకాలి గాయం అంటూ ఆమె రెండు ప్రధాన టోర్నీలనుంచి తప్పుకుంది.
అయితే ఇప్పుడు తాను 20 వారాల గర్భవతినంటూ సెరెనా స్వయంగా ప్రకటించడం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. రెడ్ఇట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌తో గత డిసెంబర్లో సెరెనాకు నిశ్చితార్థం జరిగింది. ‘సెరెనా తల్లి కాబోతుందని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ సీజన్ మొత్తం ఆమె ఆటకు దూరం కానుంది. అయితే 2018లో మళ్లీ తిరిగి కోర్టులోకి అడుగు పెడుతుంది’ అని సెరెనా తరఫున ఆమె ప్రతినిధి బుష్ నోవాక్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన సెరెనాకు ఈ ఏడాది సెప్టెంబరుతో 36 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇక తన కెరీర్‌ను ముగించే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తుండగా... పునరాగమనం చేసి మళ్లీ చెలరేగిపోయే సత్తా సెరెనాలో ఉందని మరికొందరు చెబుతున్నారు. వచ్చే వారం ప్రకటించే తాజా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ఆమె మరోసారి నంబర్‌వన్‌గా నిలవనుంది.
అసాధ్యం కాదు...
తల్లిగా మారి గతంలో పునరాగమనం చేసిన సంచలన క్రీడాకారిణులు టెన్నిస్‌లో చాలా మంది ఉన్నారు. అయితే వారిలో ముగ్గురు మాత్రం మళ్లీ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలవగలిగారు. దిగ్గజం మార్గరెట్ కోర్ట్ మొదటి పాపకు జన్మనిచ్చిన తర్వాత మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం విశేషం. ఎవాన్ గులగాంగ్ తల్లిగా మారిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో పాటు వింబుల్డన్ కూడా సొంతం చేసుకుంది. ఈతరం క్రీడాకారిణుల్లో కిమ్ క్లియ్‌స్టర్స్ కూడా అమ్మతనం అడ్డంకి కాదంటూ మూడు గ్రాండ్‌స్లామ్‌లను అందుకోవడం పెద్ద ఘనతగా చెప్పవచ్చు. అయితే సెరెనా విషయంలో వయసు మాత్రమే ప్రతిబంధకం కావచ్చనేది మాజీ ఆటగాళ్ల అభిప్రాయం. గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గకపోయినా... సర్క్యూట్లో కొనసాగుతూ పలు పెద్ద టోర్నీలు గెలిచినవారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా విక్టోరియా అజరెంకా కూడా గత ఏడాది కొడుకు పుట్టిన తర్వాత త్వరలోనే తిరిగి రానున్నట్లు ప్రకటించింది.
డబ్బు కూడా వెంటే...
మరో వైపు సెరెనా మాతృత్వంపై అప్పుడే వ్యాపార వర్గాల దృష్టి పడినట్లు సమాచారం. గర్భిణులు ధరించే ప్రత్యేక దుస్తులు, ఆ సమయంలో వాడే పోషక పదార్థాలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన అనేక ఉత్పత్తుల విషయంలో సెరెనా బ్రాండ్ బ్రహ్మాండంగా పని చేస్తుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం మ్యాచ్ ఫీజులు, బ్రాండింగ్‌ల ద్వారా సెరెనా ఆర్జన దాదాపు 29 మిలియన్ డాలర్లుగా ఉంది.
సెరెనా మళ్లీ ఆడుతుందా!
Published Fri, Apr 21 2017 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement