Sakshi News home page

దక్షిణాఫ్రికా భారీ విజయం

Published Fri, Feb 17 2017 3:24 PM

దక్షిణాఫ్రికా భారీ విజయం

ఆక్లాండ్:న్యూజిలాండ్ తో ఇక్కడ ఈడెన్ పార్క్ లో జరిగిన ఏకైక ట్వంటీ 20లో దక్షిణాఫ్రికా భారీ విజయం సాధించింది. న్యూజిలాండ్ ను 107 పరుగులకే కట్టడిచేసిన సఫారీలు 78 పరుగుల తేడాతో గెలుపొందారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఓపెనర్ డీ కాక్ ఆదిలోనే డకౌట్ గా నిష్ర్కమించనప్పటికీ మరో ఓపెనర్ హషీమ్ ఆమ్లా(62) ఆదుకున్నాడు.ఆ తరువాత డు ప్లెసిస్(36), ఏబీ డివిలియర్స్(26), డుమినీ(29) ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించకల్గింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ సఫారీలకు పోటీ ఇవ్వలేదు. టీసీ బ్రూస్(33), సౌథీ(23),గ్రాండ్ హోమ్(15)లే న్యూజిలాండ్ జట్టులో రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. దక్షిణాఫ్రికా ప్రధాన స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా, ఫెహిల్క్వాయో మూడు వికెట్లు, క్రిస్ మోరిస్ రెండు వికెట్లు తీశారు.

Advertisement

What’s your opinion

Advertisement