దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం

Published Thu, Oct 22 2015 5:19 PM

దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం

చెన్నై:దక్షిణాఫ్రికాతో ఇక్కడ చిదంబరం స్టేడియంలో గురువారం జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా 300 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లి(138; 140 బంతుల్లో 6 ఫోర్లు,5 సిక్స్ లు)) సెంచరీతో చెలరేగడంతో పాటు, సురేష్ రైనా, అజింక్యా రహానేలు రాణించి భారీ స్కోరు చేయడంలో సహకరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 35 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ(21), శిఖర్ ధవన్(7) లు వికెట్లను కోల్పోయి ఆదిలోనే తడబడినట్లు కనిపించింది. ఆదశలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను విరాట్ కోహ్లి తీసుకున్నాడు.  విరాట్ కోహ్లి, అజింక్యా రహానేతో కలిసి మూడో వికెట్ కు 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.  అయితే మూడో వికెట్ గా వెనుదిరిగిన రహానే(45) తృటిలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు.  అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సురేష్  రైనా ఆచితూచి ఆడుతూ కోహ్లికి సహకరించాడు. 

 

. ఈ క్రమంలోనే రైనా(53;52 బంతుల్లో 3 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసి ఫామ్ లో కి వచ్చాడు. ఈ జోడి నాల్గో వికెట్ గా 127 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియా స్కోరు బోర్డులో వేగాన్ని పెంచారు.  వరుసగా రెండు రెండు కీలక భాగస్వామ్యాలు నమోదు కావడంతో టీమిండియా 45 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 270 పరుగులతో దూకుడుగా కనిపించింది.  కాగా, చివర్లో దక్షిణాఫ్రికా బౌలర్లు రాణించడంతో చివరి ఐదు ఓవర్లలో మరో నాలుగు వికెట్లు నష్టపోయిన టీమిండియా 29 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(15) స్కోరును పెంచే క్రమంలో  అవుటయ్యాడు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్, రబడాలకు తలో మూడు వికెట్లు లభించగా, క్రిస్ మోరిస్ ఒక వికెట్ దక్కింది.

Advertisement
Advertisement