టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

15 Jul, 2019 10:51 IST|Sakshi

లండన్‌: న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ నయా రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మెగా ఫైట్‌లో లాథమ్‌ మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. ఫలితంగా ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక మందిని పెవిలియన్‌కు పంపిన కీపర్‌గా ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్‌(ఆస్ట్రేలియా) సరసన చేరిపోయాడు. ఈ వరల్డ్‌కప్‌లో లాథమ్‌ 21 ఔట్లలో భాగస్వామ్యమైతే, అంతకుముందు 2003 వరల్డ్‌కప్‌లో గిల్‌ క్రిస్ట్‌ కూడా సరిగ్గా 21 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు.

ఈ జాబితాలో గిల్‌ క్రిస్ట్‌, లాథమ్‌ల తర్వాత స్థానాల్లో అలెక్స్‌ క్యారీ(20, 2019 వరల్డ్‌కప్‌), కుమార సంగక్కరా(17, 2003 వరల్డ్‌కప్‌)లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో జేసన్‌ రాయ్‌, జో రూట్‌, క్రిస్‌ వోక్స్‌ క్యాచ్‌లను లాథమ్‌ అందుకున్నాడు.ఇరు జట్ల మధ్య జరిగిన తుది పోరులో ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌తో పాటు, సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడంతో ఓవరాల్‌ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ విజేతగా అవతరించింది.

మరిన్ని వార్తలు