రైల్వే క్రాసింగ్స్‌లు రక్తసిక్తం | Sakshi
Sakshi News home page

రైల్వే క్రాసింగ్స్‌లు రక్తసిక్తం

Published Sat, Dec 6 2014 10:35 PM

Another mishap at a railway crossing claims two more children's lives in UP

 న్యూఢిల్లీ: రక్షణలేని రైల్వేక్రాసింగ్‌లు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. రెప్పపాటులో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి క్రాసింగ్‌లను తొలగించడానికి సరైన విధానమేది లేకపోవడంతో రైల్వే అధికారులు కూడా వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీనికితోడు సిబ్బంది లేని క్రాసింగ్‌ల వద్ద రాకపోకలు సాగించే ప్రజల అజాగ్రత్త, తొందరపాటు చర్యల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఘటనలో వాహన చోదకులు, చిన్నారులు, పశువులు, జంతువులు ఇలా ఎన్నో విలువైన ప్రాణాలు పోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రైల్వే క్రాసింగ్‌లు ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. నివారణకు ప్రభుత్వం, రైల్వే యంత్రాంగ ం తీసుకొంటున్న చర్యలు నామమాత్రమే..సంఘటనలు జరిగినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడి తప్ప ఎలాంటి ఫలితం ఉండడం లేదనే ఆరోపణలున్నాయి.
 
 ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా..
 రక్షణ లేని రైలే ్వ క్రాసింగ్‌లన్నీ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలుగా మారిపోయాయి. తాజా ఉత్తర ప్రదేశ్‌లోని మాహులో రక్షణ లేని క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో 5గురు కిండర్‌గార్డెన్ స్కూల్ విద్యార్థులు మృత్యువా త పడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఏడా 94 మంది చనిపోయా రు. ఇలా దేశంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకొంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు, ముందస్తు చర్యలు తీసుకోవడానికి రైల్వేశాఖ వద్ద సరైన యంత్రాంగం లేదు. దుర్ఘటనలకు అంతం లేకుండా పోయింది.
 
 మొత్తంగా 30, 348 క్రాసింగ్‌లు
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30,348 రైల్వే లెవల్ క్రాసింగ్‌లు, ఇందులో 18,785 క్రాసింగిల్లో సిబ్బంది రక్షణగా ఉన్నారు. మిగతా 11,563 క్రాసింగ్‌లల్లో సిబ్బంది రక్షణ లేదని రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేస్తోంది. 40 శాతం అంటే..అత్యధిక రైల్వే ప్రమాదాలు చోటుచేసుకొంటున్న రక్షణ లేని క్రాసింగ్‌ల వద్దనే అని పలు నివేదికలు బట్టబయలు చేశాయి.
 
 తొలగించాలని సిఫార్సు
 రక్షణలేని రైల్వే క్రాసింగ్‌లను తొలగించాలని అనిల్ కాక్కోదర్ నేతృత్వంలో అత్యున్నస్థాయి భద్రతా సమీక్ష కమిటీ సిఫార్సు చేసింది. ఈ లక్ష్యాన్ని 2017 వరకు సాధించడానికి ప్రతి రైల్వేజోన్‌లో ప్రత్యేక అవసరాల వాహనం(ఎస్‌పీవీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అటమిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, అటమిక్ ఎనర్జీ విభాగం సెక్రటరీ, మాజీ ఢిల్లీ మెట్రో అధినేత ఈ శ్రీదరన్ ఈ కమిటీలో సభ్యులు. వీరంతా ఇంకా సూచనలను చేశారు. ఈ మేరకు గత ఐదే ళ్లుగా సుమారు 4,792 రైల్వే క్రాసింగ్‌లను తొలగించామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఇదే క్రమంలో మిగతా క్రాసింగ్‌లను కూడా తొలగించి, ఆయా చోట్ల సబ్‌వేలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు చెప్పారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో రైల్వేజోన్లవారిగా రైలు ప్రమాదాల నివారణకు అవసరమైన సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు.
 
 ప్రమాదాల సంఖ్య..
 రక్షణలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద..2009-10లో 65 ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. 2010-11లో -48, 2011-12లో-54, 2012-13లో -53, 2013-14లో 46 ప్రమాదాలు జరిగాయి. 2011-12 లెవల్‌క్రాసింగ్ వద్ద జరిగిన ఘటనల్లో  208 మంది, 2012-13లో124, 2013-14లో 95 మంది మృత్యువాతపడ్డారు. రైల్వే యాక్టు 1989 ప్రకారం.. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఎవరైనా చనిపోయినా, గాయాలపాలైనా ఎలాంటి నష్టపరిహారం చెల్లించడానికి అనుమతించదు. అలాంటి నిబంధనలు ఏమీ లేవు. రక్షణ ఉన్న లేదా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరిగితే, బాధితులకు జాతీయ రవాణా విభాగమే నష్టపరిహారాలను చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రమాద బాధితులకు రూ. 1,39,28,047, 12,97,108లను ఈ ఏడాది నవంబర్ 20, 2014 వరకూ చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డు ప్రయాణికులు రైల్వేశాఖ నిబంధనలను గౌరవించడం లేదని, ఫలితంగానే అత్యధికంగా రైల్వేక్రాసింగ్‌ల వద్ద చోటు చేసుకొంటున్నాయని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement