మా ఇద్దరిపై కేసులు రాజకీయ ప్రేరేపితం | Sakshi
Sakshi News home page

మా ఇద్దరిపై కేసులు రాజకీయ ప్రేరేపితం

Published Sat, Aug 31 2013 1:08 AM

Cases on both of us is an political excitable

న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించడం లేదని ఈ కేసులో ఇద్దరు నిందితులు శుక్రవారం ఆరోపించారు. ఈ మేరకు నిందితులు వినయ్ శర్మ, అక్షయ్‌ఠాకూర్ త రఫు న్యాయవాది ఏపీ సింగ్ అడిషినల్ సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా ఎదుట వాదించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసని, తమ కక్షదారులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టించారని ఆరోపించారు. వాదోపవాదాలు కొనసాగుతుండగానే సింగ్ స్పృహతప్పి పడిపోవడంతో విచారణ నిలిచిపోయింది. 
 
ఒత్తిళ్ల కారణంగా సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ (బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన న్యాయమూర్తి), మె ట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ప్రాథమిక విచారణ నిర్వహించిన న్యాయమూర్తి) వైఖరి కూడా మారిందని ఆరోపించారు. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చే యాల్సి ఉండగా, రాజకీయ నాయకులు వారిపై ఒత్తిళ్లు తెచ్చారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన తరువాత ఎలాంటి ఆదేశాలూ లేకున్నా కేసు త్వరిత విచారణకు అప్పటి న్యాయమూర్తి అమిత ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. వినయ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న రక్తపు మరకలు, నిర్భయ స్నేహితుడి బూట్ల వంటివన్నీ పోలీసులే సృష్టించారన్నారు. తగిన విశ్లేషణ లేకుండా ఫోరెన్సి క్ నివేదికలను ప్రాసిక్యూషన్ అవసరాల మేరకు త యారు చేశారని సింగ్ పేర్కొన్నారు. రాజకీయ ఒత్తి ళ్లే వీటన్నింటికి కారణమని స్పష్టం చేశారు. 
 
అయితే సింగ్ స్పృహ కోల్పోవడంతో విచారణను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించా రు. పవన్ తరఫున వాదనలను వినిపించడానికి వ చ్చే నెల రెండు దాకా సమయం కావాలన్న అతని న్యాయవాది వివేక్‌శర్మ అభ్యర్థనను కోర్టు తిరస్కరిం చింది. ఇదిలా ఉంటే మంగళవారం విచారణ సందర్భంగా డిఫెన్స్ న్యాయవాదులు మాట్లాడుతూ సామాహిక అత్యాచారానికి ‘నిర్భ య’ స్నేహితుణ్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా హిం సించారని, తమ కక్షిదారులను అన్యాయంగా కే సు ఇరికించారని ఆరోపించారు. బాధితురాలు నిర్భయ, ఆమె స్నేహితుడు ఈ కేసు వివరాలను పోలీసులకు చెప్పనేలేదని వా దించారు. అధికారు లే అతణ్ని వేధించి అసత్యాలు చెప్పించారని ఆరోపించారు. ‘అత్యాచారం జరిగిన ట్టు చెబుతున్న బస్సు, దాని రంగు వివరాలను కూ డా ఆమె వెల్లడించలేదు. 
 
నిందితుల సంఖ్య, వారు వేసుకున్న దుస్తుల గురించి కూడా తెలియజేయలేదు. నిందితుల గుర్తింపునకు సంబంధించిన ఏ ఒ క్క విషయాన్నీ ఆమె స్నేహితుడు ఎఫ్‌ఐఆర్‌లో పే ర్కొనలేదు’ అని నిందితుల న్యాయవాది ఏపీసింగ్ వాదించారు. నిర్భయ తన వాంగ్మూలంలో నిందితు లు తనపై చెంపపై కొట్టినట్టు మాత్రమే చెప్పిం దని, రాడ్డుతో దాడి చేసిన విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. ఆమెపై రెండుసార్లు అత్యాచారం జరిగినట్టు వైద్యనివేదికలు వెల్లడించాయన్నారు.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గత డిసెంబర్ 16 రాత్రి నిందితు లు రామ్‌సింగ్, వినయ్, అక్షయ్, పవన్‌గుప్తా, ముకేశ్, మైనర్ (ఇతనిపై బాలల న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది) ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలు చికి త్స పొందుతూ అదే నెల 29న సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులో కీలక నిందితుడైన రామ్‌సింగ్ మార్చి 11న తీహార్‌జైల్లో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ దాడిలో నిర్భయ స్నేహితుడికి తీవ్రగాయాలయ్యాయి. 
 

Advertisement
Advertisement