Sakshi News home page

బ్యాగ్‌ను తనిఖీ చేయాలని ఆపారు.. అంతోలోనే

Published Fri, Jul 7 2017 7:52 PM

బ్యాగ్‌ను తనిఖీ చేయాలని ఆపారు.. అంతోలోనే - Sakshi

బెంగళూరు: బెంగళూరులోని ఒక మెట్రో రైల్వే స్టేషన్‌లో సంస్థ ఉద్యోగిపై జవాను దాడి చేశాడు. కర్ణాటక పారిశ్రామిక భద్రతా దళం(కేఐఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ ఘర్షణ తో మైట్రో రైల్‌ సర్వీసులు కొన్ని గంటలసేపు స్తంభించిపోయాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు ఈ బంద్‌ కాగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలీవి.. గురువారం మధ్యాహ్నం సిటీ సివిల్‌ కోర్టు ఎదురుగా ఉన్న విశ్వేశ్వరయ్య మెట్రో స్లేషన్‌లో కేఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆనంద్‌, లక్ష్మణ్‌, భారతి విధుల్లో ఉన్నారు. మెట్రో ఉద్యోగి రాకేశ్‌ బ్యాగుతో స్టేషన్‌లోకి ప్రవేశించగా బ్యాగ్‌ను తనిఖీ చేయాలని ఆనంద్ ఆయనను ఆపారు. తాను మెట్రో సిబ్బందిని, తనిఖీ అవసరం లేదని రాకేశ్‌ సూచించారు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కానిస్టేబుల్‌ ఆనంద్‌ ఆవేశం పట్టలేక ఉద్యోగిపై పిడిగుద్దులు కురిపించారు. ఇద్దరి మధ్య తోపులాట  కూడా జరిగింది. ఈ ఘర్షణ అక్కడ సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.  ఆగ్రహం చెందిన రాకేశ్‌ ఇతర మెట్రో స్టేషన్‌లలో పని చేస్తున్న 40 మంది సహచర ఉద్యోగులను పిలిపించి కానిస్టేబుళ్లు ఆనంద్‌, లక్ష్మణ్‌, భారతీలపై దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న కానిస్టేబుళ్లు హలసూరు గేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాకేశ్‌తో పాటు మరో 40 మంది  మెట్రో సిబ్బందిపై గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు.

సిబ్బంది ఆందోళన.. చర్చలు
తమపై కేసులు బనాయించారంటూ శుక్రవారం ఉదయమే బెంటళూరులోని మొత్తం మెట్రో రైల్వే ఉద్యోగులు విధులను బహిష్కరించి బయపపనహళ్లి మెట్రో స్టేషన్‌లో  బైఠాయించారు. దీంతో ఎక్కడవక్కడే రైళ్లు ఆగిపోయాయి. ఏం జరిగిందో తెలియక వేలాది మంది ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. మొదట విధులకు హాజరు కావాలని తరువాత మిగిలిన విషయాలు చర్చించుకుందామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇకపై ఇలాంటివి పురరావృతం కానివ్వరాదని ఇరు వర్గాలకూ సూచించారు. విధులకు హాజరు కాకపోతే ఎస్మా ప్రయోగిస్తామని మెట్రో సిబ్బందిని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సిబ్బంది విధులకు హాజరయ్యారు, ఉదయం 11:30 తర్వాత మెట్రో రైళ్లు సర్వీసులు నడిచాయి.
 

Advertisement
Advertisement