Sakshi News home page

విద్యుదుత్పత్తిలో టీబీ డ్యాం పవర్ హౌస్ ప్రముఖ పాత్ర

Published Mon, Sep 22 2014 3:13 AM

విద్యుదుత్పత్తిలో టీబీ డ్యాం పవర్ హౌస్ ప్రముఖ పాత్ర

హొస్పేట :  కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పాదన కేంద్రంగా ఉన్న టీబీడ్యాం పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తిలో తనదైన ముద్ర వేసుకుంది. తుంగభద్ర డ్యాం నిర్మాణం అనంతరం అప్పటి మద్రాసు ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది. మొత్తం నాలుగు యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. వీటిలో 2 ప్లాంట్లు జపాన్‌కు సంబంధించిన తోషిబా కంపెనీకి సంబంధించినవి కాగా మరో రెండు ప్లాంట్లు స్విట్జర్‌లాండ్‌కు చెందినవి.

ఈ విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని తుంగభద్ర మండలి పర్యవేక్షిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రోజుకు సుమారు 5600 క్యూసెక్కులు నీరు కావాల్సి ఉంది. ప్రస్తుతం 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో  యూనిట్‌ను స్పేర్‌గా ఉంచారు. అంటే మిగిలిన మూడింటిలో ఏదైనా మరమ్మతుకు గురైతే అప్పుడు ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఒక్కో ప్లాంట్ రోజుకు 2 లక్షల 16 వేల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

మూడు యూనిట్ల ద్వారా రోజుకు 6 లక్షల 48 వేల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. దీనిని యూనిట్ రూ.1 ప్రకారం విక్రయిస్తారు. తద్వారా రోజుకు రూ.6,48,000 ఆదాయం వస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌కు 80 శాతం, కర్ణాటకకు 20 శాతం చొప్పున సరఫరా చేస్తారు.  ప్రస్తుతం ఇక్కడ సిబ్బంది కొరత ఉంది. అయినా ఉన్న సిబ్బందితోనే విద్యుత్ ఉత్పాదన చేస్తూ బండి లాగుతున్నారు. ఇటీవల ప్లాంట్‌లో మరమ్మతులు ఏర్పడడంతో సుమారు 15 రోజుల వరకు విద్యుత్ ఉత్పాదన ఆగిపోయింది. దీంతో కోటిన్నరకు పైగా నష్టం వాటిల్లింది.
 
సిబ్బంది కొరతతో ఇబ్బందులు : దాదాపు 200 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా కేవలం 49 మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఐదుగురు ఏడీఈలు, తొమ్మిది మంది ఏఈలు, 35 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సిబ్బం దిని 80 శాతం ఆంధ్ర  ప్రభుత్వం, 20 శాతం కర్ణాటక ప్రభుత్వం నియమి స్తుంది. అయితే ఇక్కడ కర్ణాటక వాటా సి బ్బంది మాత్రం పనిచేస్తున్నారు. మిగి లిన ఆంధ్ర వాటా సిబ్బందిని నియమిం చకపోవడంతో సిబ్బంది కొరతతో నానా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement