Sakshi News home page

డీటీసీని వేధిస్తున్న సిబ్బంది కొరత

Published Sat, Mar 1 2014 11:12 PM

DCT Staff shortage

 న్యూఢిల్లీ: ప్రతి నెలా భారీ సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండడంతో సిబ్బంది కొరత డీటీసీకి (ఢిల్లీ రవాణాసంస్థ) అతిపెద్ద సమస్యగా పరిణమించింది. డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్య భారీగా పడిపోయింది. తక్షణమే ఖాళీలను భర్తీ చేయకుంటే మున్ముందు బస్సు సేవలకు అంతరాయాలు తప్పబోవని సంస్థ అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితిని గ్రహించిన డీటీసీ, తమ సంస్థలో చేరాల్సింది గా యువతను ప్రోత్సహించడానికి ఎఫ్‌ఎం రేడియోల్లో ప్రచారం చేస్తోంది. నెలనెలా దాదాపు 130 మంది డ్రైవర్లు, కండక్టర్లు పదవీ విరమణ చేస్తుండడంతో భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయని డీటీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డీటీసీ వద్ద 5,300 బస్సులు ఉండగా 13,136 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు.
 
 వీరిలో 9,003 మంది శాశ్వత ఉద్యోగులు కాగా, 4,103 మంది కాంట్రాక్టు డ్రైవ ర్లు. కండక్టర్ల విషయానికి వస్తే 6,668 మంది శాశ్వ త, 7,749 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ప్రతి నెలా కనీసం వంద పదవీ విరమణ చేస్తున్నా రు కాబట్టి భారీ ఎత్తున నియామకాలకు సిద్ధం కావాలని నిపుణులు అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2017 నాటికి డీటీసీ పరిస్థితి దారుణం గా మారుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీని యర్ అధికారి ఒకరు అన్నారు. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్‌ఎస్‌బీ) డీటీసీకి ఉద్యోగులను నియమిస్తుంది. అయితే సిబ్బంది కొరత తీవ్రతరం కావడంతో ఇది ‘ఓపెన్ రిక్రూట్‌మెంట్’ విధానంలో నియామకాలు మొదలుపెట్టిం ది. డీఎస్‌ఎస్‌బీ ఉద్యోగాల భర్తీకి చాలా సమయం పడుతుంది కాబట్టే ఈ విధానాన్ని ఎంచుకుంది. 
 
 కొందరిపై వేటుకు అవకాశం..
 ఇదిలా ఉంటే దృష్టిలోపమున్న డ్రైవర్లు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నట్టు ఆరోపణలు రావ డం డీటీసీకి ఆందోళన కలిగిస్తోంది. తప్పు చేసినట్టు తేలితే వీరిలో చాలా మందిని తొలగించాల్సి ఉం టుంది. ఈ వివాదంపై నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని  కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. డ్రైవర్లను నియమించేందుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరపాలని సూచించింది. గురునానక్ కంటి విభాగ ఆస్ప త్రి బస్సు డ్రైవర్లకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల్లో అనేక లోపాలు ఉన్నాయని సమాచార కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులుకు పంపిన ఫైల్‌లో డీటీసీ పేర్కొంది.
 
 సదరు ఆస్పత్రి ధ్రువీకరించిన 99 మం ది అభ్యర్థుల్లో 91 మందిని డీటీసీ ఆరోగ్య విభాగం అనర్హులుగా గుర్తించింది. కాగా, ఢిల్లీ జీఎన్‌సీటీ వైద్య శాఖ నియమించిన స్వతంత్ర వైద్య బోర్డు కూడా సదరు 91 మంది అభ్యర్థులూ అనర్హులేనని నిర్ధారించినట్లు ఆచార్యులు పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో అనర్హులైన డ్రైవర్లను నియమించేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ ఆరోగ్య సెక్రటరీ ఎస్‌సీఎల్ దాస్‌కు డీటీసీ చైర్మన్, ఎండీ కూడా అయిన రాజీవ్ వర్మ 2013 సెప్టెంబర్ 11న లేఖ రాశారని ఆచార్యులు తెలిపారు. గురునానక్ కంటి విభాగం అర్హులని ధ్రువీకరించిన అభ్యర్థుల్లో ఒకరు భారీ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడని ఆయన తన లేఖలో ఉదహరించారని ఆచార్యులు వివరించారు. ఈ విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కమిషన్ సూచిం చిందని ఆయన చెప్పారు. 
 

Advertisement
Advertisement