తాగుబోతు డ్రైవర్ల లెసైన్సుల సస్పెన్షన్ | Sakshi
Sakshi News home page

తాగుబోతు డ్రైవర్ల లెసైన్సుల సస్పెన్షన్

Published Sun, Jan 19 2014 3:54 AM

Drunk drivers lesainsa suspension

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలకు కారకులైన వారితో పాటు ఫుట్‌పాత్‌లపై వాహనాలను నడిపిన మొత్తం 1,530 మంది డ్రైవర్ల లెసైన్సులను సస్పెండ్ చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ కే. అమర నారాయణ తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగం అదనపు పోలీసు కమిషనర్ దయానంద్‌తో కలసి శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది 3,830 మంది డ్రైవర్ల లెసైన్సులను రద్దు చేయాలని నివేదిక అందిందని వెల్లడించారు. వీరిలో 1,530 మంది లెసైన్సులను సస్పెండ్ చేసి, మిగిలిన వారికి నోటీసులు జారీ చేశామని చెప్పారు.
 
 మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమైన సంఘటన అనంతరం అక్టోబరు 31 నుంచి ఇప్పటి వరకు 31,610 వాహనాలను తనిఖీ చేసి, 8,018 వాహనాలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని తెలిపారు. వీటిలో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 512 వాహనాల నుంచి రూ.2.17 కోట్ల జరిమానా వసూలు చేశామని ఆయన వెల్లడించారు.భద్రతా వారోత్సవాలు : ఓజాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను సమర్థంగా నిర్వహించడానికి ఈ నెల 21 నగరంలోని కంఠీరవ స్టేడియంలో సుమారు 22 వేల మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున పరేడ్‌ను నిర్వహించనున ్నట్లు దయానంద్ తెలిపారు. నగరంలోని 250 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.  
 

Advertisement
Advertisement