ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి హత్య | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి హత్య

Published Sat, May 30 2015 5:33 AM

Election candidate killed

 ప్రతీకారంతో ప్రత్యర్థి ఇళ్లపై దాడులు జరిపిన హతుడి మద్దతుదారులు
 ముళబాగిలు తాలూగా బల్లా గ్రామంలో ఉద్రిక్తత
 ఘటనా స్థలాన్ని సందర్శించిన ఐజీపీ అరుణ్‌చక్రవర్తి

       
కోలారు/ముళబాగిలు : ఙఞ్చటగ్రామ పంచాయతీ స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థిని మారణాయుధాలతో దారుణంగా నరికి చంపిన ఘటన ముళబాగిలు పట్టణ సమీపంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చోటు చేసుకుంది. ముళబాగిలు తాలూకా బల్ల గ్రామానికి చెందిన సుబ్రమణి హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ మద్దతుదారుడైన సుబ్రమణి గతంలో గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు కూడా. గతంలో తాలూకా పంచాయతీ మాజీ అధ్యక్షుడు కాశిపుర రామకృష్ణప్ప హత్య కేసులో సుబ్రమణి నిందితుడు. గురువారం రాత్రి పట్టణ సమీపంలోని కేజీఎఫ్ రోడ్డులో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న సుబ్రమణిపై ప్రత్యర్థులు దాడి జరిపి, మారణాయుధాలతో అతనిని హత మార్చారు.

ఘటనలో సుబ్రమణి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న సుబ్రమణి మద్దతుదారులు ఆగ్రహంతో బల్లా గ్రామంలోని ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు జరిపి, ధ్వంసం చేశారు. ఓ ఆటో, మరో ట్రాక్టర్‌కు నిప్పంటించారు. సుబ్రమణి ప్రత్యర్థి అనిత, నంజుండప్ప, హరీష్, సి.ఎం.శ్రీనివాస్, సొన్నవాడి నాగరాజ్‌ల ఇళ్లపై దాడులు జరిపి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని స్వల్ప లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఎస్పీ అజయ్ హిలోరి, డీఎస్పీ అబ్దుల్ రహమాన్ గ్రామాన్ని సందర్శించారు. గురువారం ఐజీపీ అరుణ్ చక్రవర్తి బల్ల గ్రామాన్ని సందర్శించారు. ఎస్పీ అజయ్ హిలోరి మాట్లాడుతూ హంతకులను గుర్తించామనిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement