విమానాశ్రయం జనసాగరం | Sakshi
Sakshi News home page

విమానాశ్రయం జనసాగరం

Published Thu, Dec 5 2013 2:23 AM

Grand welcome to ys Jaganmohan Reddy at Chennai  airport

 అన్నానగర్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సమైక్యాంధ్ర ఉద్యమ సారథి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెన్నైలో ఘనస్వాగతం లభించింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పట్టారు. బుధవారం ఉదయం 10.15 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయూనికి చేరుకున్నారు. వందలాది వాహనాల్లో వేలాది మంది అభిమానులు ఆయన్ను అనుసరించడం, అందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించడంతో విమానాశ్రయం నుంచి రోడ్డుపైకి చేరుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. పొరుగు రాష్ట్రానికి విచ్చేసిన నేతకు ఇంతటి ఘనస్వాగతమా? ఇన్ని వేల మంది అభిమానులా అంటూ స్థానికులు ఆశ్చర్యపోయారు.10.45గంటలకు కారులో బయలుదేరిన ఆయన ఆళ్వారుపేటలోని సోదరుని ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. 
 
 సాధారణంగా ఎయిర్‌పోర్టు నుంచి ఆళ్వారుపేట చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. ఎయిర్‌పోర్టు నుంచి గిండీ, కత్తిపార జంక్షన్, నందనం, టీటీకే రోడ్డు వద్ద వేలాదిమంది జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు ఆయన కారు నుంచి బయటకు రావాలని పట్టుపట్టారు. అభిమానల కోరిక మేరకు ఆయన వాహనం దిగి వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు.స్వాగతించిన ప్రముఖులు: వైఎస్.అనిల్ రెడ్డి, వైఎస్.సునీల్‌రెడ్డి, ఎంపీ రాజమోహన్‌రెడ్డి,
 
 మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలశౌరి, పి.అక్కిరెడ్డి, ఆనందకుమార్ రెడ్డి, జేకే రెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, అనిల్‌కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కేతిరెడ్డి జగదీశన్ రెడ్డి, పి.అక్కిరెడ్డి, మేరిగ మురళి, హరిరెడ్డి, నన్నపరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, బి.రాఘవేంద్రరెడ్డి, గౌతం రెడ్డి, తాడి వీరభద్రరావు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిరణ్‌మోహన్, మైసూరారెడ్డి, జి.ప్రతాప్‌రెడ్డి, ఎల్లగిరి గోపాల్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కెన్సెస్ నరసారెడ్డి, పల్లవా సుబ్బారెడ్డి, కొమ్ముల లక్ష్మయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్సీ రాఘవేంద్రరెడ్డి, సతీష్‌రెడ్డి, ప్రతాప్ సి రెడ్డి వంటి ప్రముఖులు ఎయిర్‌పోర్టుకు వచ్చి జగన్‌కు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. విజయేంద్రరాజు, ఆర్.ప్రతాపకుమార్‌రెడ్డి, మణివన్నన్, రాజేంద్రన్, కృష్ణారెడ్డి, బేతిపూడి శేష ప్రసాద్, ప్రవీణ్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, ముంగర మధుసూదనరావు, శశిధర రెడ్డి, హరిరెడ్డి, వి.నర్శింగరెడ్డి, డి.రాజారెడ్డి, జి.సురేష్‌రెడ్డి, కె.శేఖర్ రెడ్డి, కర్రల సుధాకర్, లక్ష్మీపతి
 
 రాజు, చక్రపాణి రెడ్డి, రమేష్‌రెడ్డి, యతిసాలరాజు, శేఖర్‌రాజు, గొల్లపల్లి ఇజ్రాయెల్, విజయకుమార్‌రెడ్డి, ఏకే రాజ్, జైపాల్ జగన్‌ను స్వాగతించడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్‌పోర్టులోని విజిటర్స్ లాంజ్ మొత్తం జగన్‌ను స్వాగతించడానికి విచ్చేసిన ప్రముఖులతో క్రిక్కరిసిపోయింది. ఆళ్వార్‌పేటలో బ్రహ్మరథం:  నగరంలోని ఆళ్వార్‌పేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. జగన్ సోదరుడు వై.ఎస్.అనిల్‌రెడ్డి నివాసం వద్దకు ఉదయాన్నే జన సందోహం తరలి వచ్చింది. గంటల తరబడి ఓపిగ్గా జననేత కోసం ఎదురు చేశారు. తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జకీర్, శరవణన్ అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరుతుండడంతో ఆయన మద్దతుదారులు  అట్టహాసంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రాంతంలోని రహదారుల్లో జగన్ అభిమానులు బారులు తీరారు.
 
 రోడ్లకిరువైపులా కార్లు, వ్యాన్లు నిండిపోయాయి. జగన్ కాన్వాయ్ ఆళ్వారుపేట ప్రాంతానికి చేరుకోగానే వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ టీ షర్టులు ధరించిన కార్యకర్తలు, పోలీ సులు, జగన్‌మోహన్‌రెడ్డికి కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సు గమం చేశారు. మహిళలు జగన్ కారుపై పూలవర్షం కురిపిం చారు. కోవూరు మ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు నియోజకవర్గం కో ఆర్డినేటర్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, గూడూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ పాశం సునీల్‌కుమార్, రాజమండ్రి వైఎస్సార్ సీపీ యువజన నేత పి.కిరణ్‌మోహన్‌రెడ్డి విచ్చేశారు. వేలాది మందితో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.  

Advertisement
Advertisement