‘జయ’ రోడ్ షో! | Sakshi
Sakshi News home page

‘జయ’ రోడ్ షో!

Published Sun, Apr 20 2014 1:59 AM

Jayalalithaa road show in Chennai

 సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమ అభ్యర్థులకు మద్దతుగా మార్చి మూడో తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతూ బహిరంగ సభల రూపంలో
 ఫోటో : 31 : దారి పొడవునా అభిమానం
 ఫోటో : 32 : స్టెప్పులు
 ఫోటో : 33 : ప్రత్యేక ఆకర్షణ
 ఠ మొదటిపేజీ తరువాయి
 ఇన్నాళ్లు ఆమె ప్రచారం సాగింది. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలను కైవశం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న జయలలిత, ఓటర్ల వద్దకు నేరుగా వెళ్లేందుకు నిర్ణయించారు. బహిరంగ సభ రూపంలో కాకుండా రోడ్ షోకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారు.
 రోడ్ షో కోసం ప్రత్యేకంగా వాహనాన్ని సిద్ధం చేశారు. ఇందులో ముందు సీట్లో జయలలిత కూర్చున్నా ఓటర్లకు కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. జన సందోహం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఆ వ్యాన్‌లోని సౌకర్యం మేరకే పైన ఏర్పాటు చేసిన బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాల బోనులో నుంచి జయలలిత ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం తన రోడ్ షోకు జయలలిత శ్రీకారం చుట్టారు. పోయేస్ గార్డెన్ నుంచి బయలుదేరిన ఆమె తొలుత ఆలందూరు అసెంబ్లీ నియోజకర్గం ఉప ఎన్నిక బరిలో ఉన్న పార్టీ అభ్యర్థి వెంకటరామన్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. మీనంబాక్కం నుంచి ఆరంభమైన జయలలిత తొలి రోజు రోడ్ షో 54 కి.మీ దూరం సాగింది.
 
 నీరాజనాలు: రోడ్ షోలో జయలలితకు అడుగడుగున పార్టీ శ్రేణులు, ప్రజలు నీరాజనం పలికారు. పలవన్ తాంగళ్ , ఆలందూరుల్లో అక్కకడక్కడ జనంలో ఉత్సాహాన్ని నింపే రీతిలో ఎంజీయార్, జయలలిత వేషధారణలతో కళాకారులు పలు హిట్ సాంగ్స్‌కు స్టెప్పులతో అలరించారు. మేళతాళాలు, కోలాటాలు, కరగాట్టాల నడుమ జయలలిత రోడ్ షో సాగింది. దక్షిణ చెన్నై లోక్‌సభ అభ్యర్థి జయ వర్ధన్‌కు మద్దతుగా గిండి పరిసరాల్లో కాసేపు రోడ్ షో సాగింది. అనంతరం సెంట్రల్ చెన్నై అభ్యర్థి విజయకుమార్‌కు మద్దతుగా ఎంఎండీఏ, రాజక్ గార్డన్స్, పూందమల్లి రోడ్డు, న్యూ ఆవడి రోడ్డు, ఐనావరం, కెల్లిస్ వంతెన, పురసైవాక్కం, ఏపీ రోడ్డు, వాల్టాక్స్ రోడ్డు, సెంట్రల్, అన్నా సాలై, వాలాజా రోడ్డు మీదుగా ట్రిప్లికేన్ వరకు రోడ్ షో సాగింది.
 
 ఏడు చోట్ల ప్రసంగాలు : రోడ్ షోలో ఏడు చోట్ల జయలలిత ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జనం అత్యధికంగా గుమిగూడి ఉన్న ఆలందూరు కోర్టు సమీపంలో, మీనంబాక్కంలో, రజాక్ గార్డెన్స్, పురైవాక్కం, ట్రిప్లికేన్  తదితర ప్రాంతాల్లో ఆమె ప్రసంగిస్తూ, తమకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తమ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు. డీఎంకే తీరును, అవినీతి బాగోతాల్ని, ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీల చేతి వాటాల్ని, నిర్లక్ష్యాన్ని వివరిస్తూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. జయలలిత రోడ్ షో జరిగిన మార్గాల్లో వాహన చోదకులు రేక్ డైవర్షన్లతో నగరాన్ని చుట్టాల్సి వచ్చింది. డీఎంకే అధినేత కరుణానిధి రోడ్‌షో రూపంలో అలరించే యత్నం చేశారు. అయితే ఆయన ఎంజీఆర్ నగర్ కూడలిలో ప్రసంగించి ముగించారు.  
 

Advertisement
Advertisement