కిడ్నాపర్ల చెరనుంచి విముక్తి | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ల చెరనుంచి విముక్తి

Published Sat, Feb 1 2014 11:28 PM

కిడ్నాపర్ల చెరనుంచి విముక్తి - Sakshi

 ఠాణే: అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడి ఆచూకీ లభ్యమైంది. ఈ కేసుకు సంబంధించి ఓ మహిళసహా మొత్తం నలుగురు నిందితులను ఠాణే గ్రామీణ పోలీసులు కోల్‌కతాలో అరెస్టుచేశారు. కాగా ఈ కే సుకు సంబంధించిన వివరాలను డీసీపీ అనిల్ కుంభారే శనివారం మీడియాకు వివరించారు. ప్రధాన నిందితురాలు పింకి తులసి, బాధితురాలు రూబీ విద్యారతన్‌వర్మలు మీరారోడ్డులోని ఓ బార్‌లో పనిచేసేవారన్నారు. తరచూ ఒకరి ఇంటికి మరొకరు వెళుతుండేవారు. అయితే కొద్దిరోజుల క్రితం ఇరువురి మధ్య చిన్న వివాదం చోటుచేసుకుందన్నారు. ఇదే ఈ అపహరణ కుట్రకు దారితీసిందన్నారు.
 
  గత నెల 24వ తేదీన నిందితులు పింకి, కిరణ్ గుప్తా, టింకూసింగ్, నాలుగేళ్ల ఆయుష్‌ను అపహరించుకుపోయారన్నారు. ఆ తర్వాత వారు బాధితురాలు విద్యారతన్‌కు కోల్‌కతాలోని ఓ పబ్లిక్ ఫోన్ నుంచి కాల్ చేశార ని చెప్పారు. బాలుడిని విడిచిపెట్టాలంటూ రూ. 26 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. దీంతో తాము ఓ బృందాన్ని కోల్‌కతాకు పంపామన్నారు. తమ సిబ్బంది నిందితులను అరెస్టుచేసి ఇక్కడికి తీసుకొచ్చారన్నారు. కథ సుఖాంతం కావడంతో ఆయుష్ తన కుటుంబసభ్యులను శనివారం కలుసుకున్నాడన్నారు. ఈ కేసుకు సంబంధించి పింకి తల్లి రీనీదేవిని కూడా అరెస్టు చేశామన్నారు. కోల్‌కతాకు బాలుడిని కోల్‌కతాకు తీసుకెళ్లినవారిలో ఆమె కూడా ఉందన్నారు.
 
 
 

Advertisement
Advertisement