‘క్లీన్ ఇండియా’ ధ్యేయం | Sakshi
Sakshi News home page

‘క్లీన్ ఇండియా’ ధ్యేయం

Published Sun, Dec 14 2014 3:05 AM

‘క్లీన్ ఇండియా’ ధ్యేయం

కొరుక్కుపేట: ‘క్లీన్ ఇండియా..గ్రీన్ ఇండియా’ స్థాపనే ధ్యేయంగా ప్రతి భారతీయుడు స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం చెన్నై నగరంలోని ఓ హోటల్లో రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యం లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రోటరీ ఇంటర్నేషనల్ డెరైక్టర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు దేశ ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ మిషన్‌కు శ్రీకారం చుట్టారని అన్నారు.
 
 పరిశుభ్రతతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్న మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుంటూ స్వచ్ఛభారత్‌కు శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందులో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్‌తోపాటు, ప్రముఖ వ్యక్తులు, సెలబ్రెటీలను, ప్రజలను సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చామన్నారు. క్లీన్ ఇండియా...గ్రీన్ ఇండియా స్థాపనకు అడుగులుపడడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం సైతం వచ్చే ఐదేళ్లలో దేశ అభివృద్ధికి రూ.2లక్షల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రూ.1.34 కోట్లు మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తుందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి పూర్తిస్థాయిలో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
 
 పరిసరాల శుభ్రంగాల ఏకపోవడం వల్లే విద్యార్థులు మలేరియా, డెంగీ, డయేరియా లాంటి వ్యాధులతో మృత్యువాత పడుతుండడం బాధాకరమన్నారు. 2019 మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నాటికి భారత్‌ను క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. రోటరీ బృందాలు స్వచ్ఛభారత్‌లో మేము సైతం అంటూ ముందుకు రావటం సంతోషంగా ఉందని వారిని అభినందించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుగా నిలుస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement