Sakshi News home page

ఇష్టారీతిన విద్యుత్‌ కోతలు

Published Mon, Oct 17 2016 3:05 PM

ఇష్టారీతిన విద్యుత్‌ కోతలు - Sakshi

అనధికారిక కోతలతో ఇబ్బందుల్లో స్థానికులు
యథేచ్చగా చెట్ల నరికివేత
రోజంతా కరంట్‌ కట్‌
ఫోన్ చేస్తే దురుసుగా సమాధానం
ఆన్ లైన్ సేవలన్నీ బంద్‌
 
పరిగి: విద్యుత్‌ పనుల పేరిట ఇష్టారీతిలో అనధికారికంగా విద్యుత్‌ కోతలు విధిçస్తున్నారు. విద్యుత్‌ లైన్లు లాగడం కోసం వందల చెట్లు నరికేస్తున్నారు. ఇదేంటని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెబుతున్నారు. కోతలు లేవంటూనే దర్జాగా పదిగంటలు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేస్తున్నారు. ఇష్టామొచ్చినట్లు  విద్యుత్‌ను తీసేస్తున్నారు. వారంలో రెండు సార్లు పదిగంటలకంటే అధికంగా కోతలు విధిస్తూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కోతలు విధిం చిన ప్రతిసారి 8 నుంచి 10 గంటలు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు. ఒక్కోసారి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎల్సీ తీసుకుని, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కూడా కాంట్రాక్టర్లు లైన్ ను  క్లియర్‌ చేయడంలేదు. ఆ శాఖ అధికారులు విని యోగదారుల బాధలు పట్టించుకోకుం డా కాంట్రాక్టర్లకే వంతపాడుతున్నారు. 32 కేవీ లైన్లు సైతం ఇళ్ల మధ్య నుంచి, దుకాణ సముదాయాల నుంచి తీసుకెళ్తూ ప్రమాదాలను నెత్తినపెడుతున్నారు. ఇప్పటికే పట్టణవాసులు, ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు విద్యుత్‌  అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించడంలేదు.
 
ఆన్ లైన్ సేవలన్నీ బంద్‌..
అనధికార కోతలతో ఆన్‌లైన్‌ సేవలన్నీ బందయ్యాయి. ఏడాది కాలంగా అనధికారికంగా కోతలు కొనసాగుతూనే ఉ న్నాయి. వారంలో ఒకటీ, రెండు సార్లు రోజంతా కోతలు విధించడం పరిగిలో సర్వసాధారణమైంది. దుకాణ సముదాయాలకు ఆనుకుని విద్యుత్‌ స్తంభాలు పాతుతున్నారు. ఎవరైనా అడిగితే సాధ్యమైనంతవరకు వారే సమాధానం చెబుతున్నారు. లేదంటే కొందరు నాయకుల చేత మాట్లాడించి, భయపెట్టిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కోతల కారణంగా జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్‌ నెట్‌ సెంటర్లు, మీసేవ, తదితర ఆన్ లైన్ సర్వీసులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్యాంకులు, కార్యాలయాలు, ఇతర సంస్థల్లో ఆన్ లైన్  సేవలు నిలిచిపోతున్నాయి. విద్యుత్‌ సరఫరా లేక అధికారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. కొందరైతే ఆన్ లైన్  సేవలు పనిచేయక అత్యవసరం ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవటానికి గడువు లేని వారు వికారాబాద్‌ తదితర పక్క మండలాలకు వెళ్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement