న్యూఢిల్లీ: వాహనాల అతివేగం ప్రాణాలు హరిస్తోంది. గాల్లో వెళ్తుండగానే.. క్షణాల్లో ప్రమాదం జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగంతో మోటారుసైకిళ్లు, వాహనాలు నడపడం వల్ల రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. వేగం కారణంగా జరిగే ప్రమాదాలతో యువకుల భవిష్యత్ అంధకారంగా మారుతోంది. కుటుంబాల్లో విషాదం మిగుల్చుతోంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం.. వేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రవాణా శాఖ రూపొందించిన సూచనలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. ఎవరి గమ్య స్థానాలకు వారు సురక్షితంగా చేరుకోవచ్చు. డ్రైవింగ్ చేసే సమయంలో వేగంకన్న ప్రాణమే మిన్న సూత్రాన్ని మదిలో ఉంచుకుంటే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు.
సూచనలు..
గుండ్రని జంక్షన్ వద్ద వాహనాల వేగం తగ్గించాలి. ఎడమ వైపు తిరగడానికి వలయంలోని బయటలైన్లో వెళ్లాలి. గుండ్రని జంక్ష న్ నుంచి బయటకు రావడానికి ఎడమ వైపు సిగ్నల్ చూడాలి. జంక్షన్ నుంచి బయటకు వెళ్లే వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బ్లైండ్ స్పాట్ : వాహన చోదకుడు మిర్రర్ ముందు భాగంలో కానీ.. రివర్స్ వ్యూ మిర్రర్లో కానీ చూడలేని ప్రదేశాన్ని బ్లైండ్స్పాట్ అంటారు. ఇతర వాహనాల బ్లైండ్ స్పాట్లో మీ వాహనం నడుపవద్దు. అలాంటి ప్రదేశాల వద్ద మలుపు తిరుగుతున్నప్పుడు లేదా లైన్ మలుగుతున్నప్పుడు ఒక్కసారి తల తిప్పి గమనించాలి.వాహనాన్ని వెనుకకు నడపడానికి..: చిన్న రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి వాహనాన్ని రివర్స్ చేయవద్దు. సాధ్యమైనంత వరకు డ్రైవర్ సీటు వైపు రివర్స్ చేయాలి. వెనుక ప్రదేశాన్ని మిర్రర్లో గమనించాలి.వర్షం, పొగ మంచు : వర్షం, పొగ మంచులో వాహనాన్ని నెమ్మదిగా నడపాలి. రోడ్లు స్పష్టంగా కనిపించకపోతే డిమ్‌లైట్లు ఉపయోగించాలి.
దూరం పాటించాలి..
డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి బ్రేక్ వేయడానికి కొంత సమయం పడుతుంది. దీనిని రియాక్షన్ టైం అంటారు. బ్రేక్ వేసిన తర్వాత వాహనం నిలుపడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు వాహనం కొంత ముందుకు వెళ్తుంది. వాహనం వేగం పెరిగినకొద్దీ నిలబడే దూరం పెరుగుతుంది. అందువల్ల ముందు వెళ్తున్న వాహనం నుంచి తగినంత దూరంలో ఉండాలి. రద్దీ రోడ్లపై వాహనాన్ని వేగంగా నడుపవద్దు. ముందు వెళ్లే వాహనం అకస్మాత్తుగా వేగం తగ్గించినా లేదా ఆగినా ప్రమాదం జరుగకుండా నివారించడానికి వాహనాల మధ్య కొంత దూరం పాటించాలి.వర్షం మొదలైన మొదటి అరగంట సమయంలో రోడ్డు మీద ఉన్న ఆయిల్, గ్రీస్, మట్టి వర్షం నీటితో కలిసి జారుడు ఉంటుంది. వాహనం చాలా నమ్మెదిగా నడపాలి.కల్వర్టులు, వంతెనలపై వర్షపు నీరు ప్రవహిస్తునప్పుడు వాహనాన్ని నిలిపివేతయాలి.తక్కువ లోతునీళ్లలో వాహనం నడిపేటప్పుడు లోడ్ గేర్ ఉపయోగించి ఇంజన్స్పీడ్ పెంచి రోడ్డుకు మధ్యలో వెళ్లాలి.
రాత్రివేళల్లో డ్రైవింగ్..
ఎదురుగా వాహనం వచ్చినప్పుడు హెడ్లైట్లు డిమ్ చేయాలి.ఓవర్‌టెక్ చేసేటప్పుడు హెడ్లైట్లు బ్రైట్, డిమ్ చేసి ముందు వాహన డ్రైవర్‌కు సంకేతం ఇవ్వాలి. హైవే రోడ్ల మీద వాహనం పార్క్ చేయరాదు. చీకటి ప్రదేశంలో నిలిపిన, వెనుక భాగాన లైట్లు లేని వాహనాలను గమనించండి. ఒకే లైటు ఉన్న నాలుగు చక్రాల వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. వెనుక వచ్చే వాహనం ఓవర్‌టెక్ చేసేందుకు దారి ఇవ్వడానికి ఎడమ ఇండికేటర్ లైట్‌ను ఉపయోగించాలి. కుడిపక్క ఇండికేటర్ వాడరాదు.రోడ్డు మీద వాహనం నిలిపినప్పుడు పార్కింగ్ లైట్ వేయాలి. డ్రైవర్ ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి వాహనం నిలిపి విశ్రాంతి తీసుకోవాలి.
ద్విచక్ర వాహనదారులు..
వాహనం వేగం తగ్గించడానికి లేదా ఆపడానికి ముందు, వెనుక బ్రేక్ ఒకేసారి సున్నితంగా ఉపయోగించాలి. నూనె మరకలు, నీళ్లు, ఇసుక, బురద తదితర జారుడు స్వభావం ఉన్న రోడ్లపై వాహన వేగం తగ్గించాలి. ఇలాంటి రోడ్లపై బ్రేక్ వేస్తే జారి పడే అవకాశం ఉంటుంది.
వేగం కన్న.. ప్రాణం మిన్న..
Published Thu, Jul 31 2014 10:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement