నగరానికి నవరాత్రి శోభ | Sakshi
Sakshi News home page

నగరానికి నవరాత్రి శోభ

Published Sat, Oct 5 2013 1:59 AM

Today's offering from the Navaratri

సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం నవరాత్రి శోభను సంతరించుకుంది. ఢిల్లీలోని దుర్గామాత ప్రధాన మందిరాలన్నింటినీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శనివారం నుంచి జరగనున్న దేవీ నవరాత్రులకు ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులపాటు జరగనున్న ప్రత్యేక పూజల కోసం ఢిల్లీలోని ప్రముఖ ఆలయాలన్నింటిని విద్యుద్దీప కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఢిల్లీలోని ఝండేవాలా మందిర్, కల్కాజీ మందిర్, చత్తర్‌పూర్ మందిర్, గౌరీశంకర్ మందిర్‌తోపాటు బెంగాలీలు అధికంగా ఉండే చిత్తరంజన్ పార్క్ ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల14 వరకు జరగనున్న నవరాత్రి ప్రత్యేక పూజల్లో భాగంగా వేలాది మంది భక్తులు ఉపవాసాలు ఉండనున్నారు. 
 
 తొమ్మిది రోజులపాటు అమ్మవారి ప్రత్యే క అలంకరణలు చూసి తరించేందుకు ఆయా ఆల యాల్లో వేలాదిగా భక్తులు బారులు తీరనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. విద్యు త్ దీపాల అలంకరణలతో ఆలయ ప్రాంగణాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఢిల్లీలోని మిగతా కాళీ మందిరాలు, రామాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.  దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించే విగ్రహాల తయారీ దాదాపు పూర్తయింది. తయారీదారుల నుంచి కొనుగోలు చేసిన అమ్మవారి విగ్రహాలను తరలించడంతో భక్తులు నిమగ్నమయ్యారు. వాడవాడలా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజులు ప్రత్యేక పూజ లు నిర్వహించనున్నారు. నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
 
 నేటి నుంచి రామ్‌లీలా ప్రదర్శన...
 దేవీ నవరాత్రుల ప్రారంభాన్ని పురస్కరించుకొని రామ్‌లీలా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి ఐదు రోజులపాటు రాంలీలా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మొదట చాందినీ చౌక్‌లోని సైకిల్‌మార్కెట్ నుంచి ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు.
 
 భద్రత కట్టుదిట్టం..
 నగరంలోని ప్రధాన ఆలయాలన్నింటికి భద్రత పెం చారు. ఆయల పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశా రు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌తోపాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆలయాల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. వీరితోపాటు సాయుధ సిబ్బంది పహారా ఏర్పాటు చేశారు. పండగలతో ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్లు పెరగనున్న నేపథ్యంలో కరోల్‌బాగ్, సరోజినీనగర్,పాలికాబజార్, చాందినీచౌక్ మార్కెట్లలో మెటల్ డిటెక్టర్లను ఏర్పా టు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement