మార్చి 4 వరకు తీర్పు ప్రకటించొద్దు | Sakshi
Sakshi News home page

మార్చి 4 వరకు తీర్పు ప్రకటించొద్దు

Published Wed, Feb 25 2015 10:40 PM

Uber rape case: HC asks trial court not to pronounce judgment till March 4

ఉబర్ కేసులో ట్రయల్ కోర్టును కోరిన ఢిల్లీ హైకోర్టు
 న్యూఢిల్లీ: ఉబర్ కేసులో తీర్పును మార్చి 4 వరకు ప్రకటించొద్దని ఢిల్లీ హైకోర్టు బుధవారం ట్రయిల్ కోర్టును కోరింది. ట్రయిల్ కోర్టు ఫిబ్రవరి 18న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ....కేసులో 28 మంది సాక్షులను మరోసారి విచారణ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ నిందితుడు శివకుమార్ యాదవ్ తరఫు న్యాయవాది డీకే మిశ్రా హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ కేసులో నిందితుడు, పోలీసుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత జస్టిస్ సునీతా గుప్తా తీర్పును రిజర్వ్ చేశారు. ‘నిందితుడు తనగురించి చెప్పుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదు.
 
 ఇంతకు ముందు యాదవ్ తరఫున వాదించిన న్యాయవాది ఆ 28 మంది సాక్షులను సరిగా విచారణ చేయలేదు. ఈ కేసులో కనీసం 13 మంది సాక్షులను మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది’ అని మిశ్రా కోర్టుకు కోర్టుకు తెలిపారు. అయితే ఇదంతా కేసు విచారణను ఆలస్యం చేసే ప్రయత్నమేనని, నిందితుడి విజ్ఞప్తిని తిరస్కరించాలని ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ మంజన్ కోర్టుకు చెప్పారు. ప్రస్తుతం ట్రయిల్ కోర్ట్ రోజు వారీగా చివరి వాదనలు వింటోంది. కాగా, జనవరి31 నాటికి కేవలం 17 రోజుల వ్యవధిలో సాక్షులందరి మాటలను రికార్డు చేసింది.
 

Advertisement
Advertisement