భర్త ఇంట్లో భార్యకు భద్రత కల్పించాలి | Sakshi
Sakshi News home page

భర్త ఇంట్లో భార్యకు భద్రత కల్పించాలి

Published Sun, Nov 6 2016 2:16 AM

భర్త ఇంట్లో భార్యకు భద్రత కల్పించాలి - Sakshi

పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు
 టీనగర్: భర్త ఇంటిలో నివశించేందుకు భార్యకు తగిన భద్రత కల్పించాలని ఉడుమలైపేట పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మద్రాసు హైకోర్టులో తమిళరసి దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టు ఈ విధంగా పేర్కొంది. కుటుంబ సమస్యల కారణంగా భర్తను, ఏడేళ్ల కుమారుడిని విడిచి జీవిస్తున్నట్లు ఆమె కేసు దాఖలు చేసింది. తన భర్త ఇంటిలో నివశించేందుకు కుటుంబ హింస చట్టం అనుమతి కోరుతూ కోవై సెషన్‌‌స కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, కోర్టు కూడా భర్త ఇంట్లో నివశించేందుకు తనకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. భర్త ఇంటికి వెళ్లేందుకు తగిన భద్రత కల్పించమని ఉడుమలైపేట పోలీసు ఇన్ స్పెక్టర్, మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు పిటిషన్లు అందజేసినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి పీఎన్ ప్రకాష్ సమక్షంలో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో పిటిషనర్ తన భర్త ఇంటిలో జీవించేందుకు తగిన సంఖ్యలో పోలీసుల భద్రత కల్పించాలని ఉత్తర్వులిచ్చారు.
 
 ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోండి
 కావేరి నదిలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కావేరి నది పరిరక్షణ సంఘం సభ్యులు కరూర్ జిల్లాలో ఆందోళనలు చేస్తున్నారని.. అయినా ఇసుక చోరీలపై చర్యలు తీసుకోవడం లేదని సంఘం సభ్యులు కరూర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు కోర్టు న్యాయమూర్తి రేవతికి విన్నవించారు.
 

Advertisement
Advertisement