చిన్నారిని కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు | Sakshi
Sakshi News home page

చిన్నారిని కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు

Published Fri, Jun 23 2017 10:15 AM

చిన్నారిని కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు - Sakshi

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడిపోయిన 19 నెలల చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 12 గంటల నుంచి చిన్నారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బాలికను రక్షించేందుకు ఆధునిక పరికరాలతో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బోరుబావిలో పడిన చిన్నారులను రక్షించడంలో నైపుణ్యం కలిగిన నల్లగొండ జిల్లాకు చెందిన పుట్ట కరుణాకర్‌ బృందం సైతం వారికి సహకారం అందిస్తోంది. బోరుబావికి సమాంతరంగా పొక్లెయిన్‌తో గుంత తవ్వారు. బోరులోకి ఆక్సిజన్‌ పంపుతున్నారు. చిన్నారికి ధైర్యం కలిగించేందుకు సిబ్బంది తల్లితో మాట్లాడించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ రఘునందనరావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

చేవెళ్ల మండలం చన్‌వెల్లి పంచాయతీ పరిధిలోని ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 6.30కి ఈ సంఘటన జరిగింది. యాదయ్య, రేణుక దంపతుల చిన్నకూతురు చిన్నారి ఆడుకుంటూ సమీప పొలంలోని బోరుబావిలో పడిపోయింది. చిన్నారి క్షేమంగా బయటపడాలని గ్రామస్తులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement