కారు బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు

Published Mon, Mar 14 2016 2:46 PM

2 injured in car roll at medak destrict

పెద్దశంకరంపేట: కారు బోల్తా పడి ఇద్దరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారులో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని టెంకటి గ్రామానికి చెందిన సీహెచ్ విజయ్ (23) తన అన్న కుమారుడు చరణ్(10) తో కలిసి మాడ్చెట్‌పల్లికి వెళ్తుండగా కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో కారులోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement