Sakshi News home page

రైలు పట్టాలపై శవం ఉండగానే...

Published Sat, May 10 2014 9:27 AM

ఎస్ఐని పట్టించిన సౌజన్య, రైల్వే ఎస్ఐ అనిల్ కుమార్ (అంతర్ చిత్రం) - Sakshi

మంచిర్యా ల రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్ఐ దేవళ్ల కిరణ్‌కుమార్ అవినీతి పాపం పండింది. ఓ మహిళ చేసిన సాహసంతో కటకటాలపాలయ్యాడు. సామాన్యులను జలగల్లా పట్టి పీడిస్తున్న కిరణ్ ఆగడాలకు ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ అధికారులు చెక్ పెట్టారు. రైలు పట్టాలపై రక్తపు మరకలు ఆరక ముందే శవాన్ని తీయాలన్న, కేసు నమోదు చేయాలన్న లంచం ఇస్తేనే పని జరిగే ది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళకు మానవత్వంతో సహకారం అందించాల్సిన ఎసై్స లంచం ఇవ్వాలంటు వేధించడంతో ఆ మహిళా తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది.

లంచం ఇస్తేనే..
రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌కు చెంది న దయానంద్ పొట్టకూటి కోసం ఆరు నెలల  క్రి తం హైదరాబాద్ కు వలస వెళ్లాడు. మియాపూర్‌లో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా అతని భార్య సౌజన్య ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తుంది. స్వగ్రామానికి వచ్చిన అనంతరం ఫిబ్రవరి 24న తిరిగి సౌజన్య హైదరాబాద్‌కు బయలుదేరగా దయానంద్ జమ్మికుంట వెళ్లడానికి సిద్ధమయ్యారు. బెల్లంపల్లిలో గమ్య స్థానాలకు టిక్కెట్‌లు తీసుకున్నారు.

కదులుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నుంచి దయానంద్ జారి కిందపడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడని మంచిర్యాల ఎస్ఐ కిరణ్‌కుమార్ కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, తుది నివేదిక పత్రా లు ఇవ్వడానికి రూ.50వేలు లంచం అడిగాడు. భర్తను కోల్పో యి, పేదరికంతో అల్లాడుతున్న తనను లంచం అడగడంతో ఎక్కడి నుంచి డబ్బులు తేవాలని కలవరపడింది సౌజన్య. ఏసీబీ అధికారుల సహకారంతో శుక్రవారం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది.  ఈ ఘటన దక్షిణ మధ్య రైల్వే పోలీసుల్లో కలకలం సృష్టించింది.


ఆది నుంచి వివాదాస్పదుడే..
రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కిరణ్‌కుమార్ పోలీ స్ శాఖలో చేరినప్పటి నుంచి వివాదాస్పదుడిగా, అవినీతి పరునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ఉద్యోగంలో చేరిన కిరణ్ తొలుత లింగాపూర్, ఆ తర్వాత నేరడిగొండ, భైంసాలలో పని చేశాడు. అక్కడ అనేక ఆరోపణలు వచ్చాయి. 2012లో రైల్వే పోలీసుల్లోకి వ చ్చాడు. మంచిర్యాల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రైలు ప్రమాదం ఎక్కడ జ రిగిన బాధితుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులే హత్య చేసి కేసు నమోదు చేస్తానని బెదిరించే వాడు. డబ్బులు ఇవ్వకపోతే రాత్రంతా శవం రైలు పట్టాలపై ఉండాల్సిందే. కుటుంబ సభ్యులు జాగారం చేయాల్సిందే. ఏసీబీకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదు వెళ్లినా పట్టివ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. చివరకు సౌజన్య సాహసంతో అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది.

నిర్భయంగా ఫిర్యాదు చేయండి : ఏసీబీ డీఎస్పీ
అవినీతి అధికారుల భరతం పట్టడానికి ప్రజ లు నిర్భయంగా ఏసీబీకి సహకరించాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కోరారు. ఏసీబీకీ చెబితే తమ పనులు పూర్తి కావనే భయం వద్ద ని ఆయన సూచించారు. బాధితుల తరఫున తాము పోరాడి పనులు చేయిస్తామని ఆయన అన్నారు. అవినీతి అధికారుల గురించి తమకు ఫోన్, లేదా ఎస్‌ఎంఎస్ చేయవచ్చని ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలు అందచేస్తే విచారణ జరిపి వాస్తవమని తేలితే కోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామని, అయితే తప్పుడు సమాచారం ఇస్తే కేసుల్లో చిక్కుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లాలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల పై ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు రమణమూర్తి, వేణుగోపాల్ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement