సెల్‌ఫోన్‌లో మాటలు..ఆపై చెప్పుదెబ్బలు | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌లో మాటలు..ఆపై చెప్పుదెబ్బలు

Published Wed, May 13 2015 8:46 AM

సెల్‌ఫోన్‌లో మాటలు..ఆపై చెప్పుదెబ్బలు - Sakshi

బీజేపీ నాయకుడికి దేహశుద్ధి
మహిళా కౌన్సిలర్ తెగువ
మాజీ చైర్మన్ ఎదుటే ఘటన

 
సిరిసిల్ల : సెల్‌ఫోన్‌లో మాటలు.. చెప్పుదెబ్బలకు దారితీసిన సంఘటన సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. ఓ మహిళా కౌన్సిలర్ సీనియర్ బీజేపీ నాయకుడికి దేహశుద్ధి చేయడం వెలుగుచూసింది. బీజేపీ మహిళా కౌన్సిలర్ పింఛన్‌సొమ్ము స్వాహా చేస్తున్నారంటూ అదేపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అన్నారు. అంతేకాదు.. కౌన్సిలర్లు బోగస్ పేర్లు సృష్టించి ప్రతీనెల రూ.ముప్పైవేల వరకు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఈ మాటల్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఓ వ్యక్తి.. ‘మా కౌన్సిలర్, ఆమె భర్త చాలా మంచోళ్లు.. వారు అలా చేయడం లేదు’ అన్నాడు. ‘నీకేం తెలుసురా’ అంటూ తనవద్ద తగిన ఆధారాలు ఉన్నాయని బీజేపీ నాయకుడు చెప్పగా అదిసైతం రికార్డయింది. బీజేపీ మహిళా కౌన్సిలరేకాకుండా మిగతా కౌన్సిలర్లు కూడా ఇదే పని చేస్తున్నారని అన్నారు. సెల్‌ఫోన్ రికార్డులోని మాటల్ని విన్న సదరు బీజేపీ మహిళా కౌన్సిలర్, ఆమె భర్త ఆగ్రహంతో ఊగిపోయారు.
 
బీజేపీ నాయకుడిని మాజీ చైర్మన్ ఇంటికి పిలిచి పంచాయితీ పెట్టారు. తాను అలా అనలేదని సదరు నాయకుడు తప్పించుకునేందుకు కత్నించగా సెల్‌ఫోన్‌లో రికార్లరుున మాటల్ని వినిపించారు. అక్కడ ఉన్న మిగతా కౌన్సిలర్లు, వారి భర్తలు ఈ మాటల్ని విని కంతిన్నారు. అంతలోనే మహిళా కౌన్సిలర్ చెప్పుతో బీజేపీ నాయకుడికి దేహశుద్ధి చేసినట్లు వీడియో చిత్రాలు పట్టణంలో పలువురు సెల్‌ఫోన్లలో ప్రత్యక్షమయ్యాయి.  ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది. సెల్‌ఫోన్ మాటలు.. చెప్పుదెబ్బల ఘటన ఎలా ఉన్నా.. బినామీ పేర్లతో పింఛన్ల స్వాహాపై క్షేత్రస్థాయి విచారణ చేపడితే అర్హులకు పింఛన్లు దక్కే అవకాశం ఉంది.

Advertisement
Advertisement