తారుమారు | Sakshi
Sakshi News home page

తారుమారు

Published Sat, May 31 2014 3:53 AM

తారుమారు - Sakshi

  •       తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్‌కు
  •      అక్కడి రాజ్యసభ సభ్యులు ఇక్కడికి
  •      ‘లాటరీ’ కేటాయింపులో మారిన వైనం
  •  సాక్షి, సిటీబ్యూరో: రాజ్యసభ సభ్యుల్ని లాటరీ పద్ధతిలో ఇరు రాష్ట్రాలకు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు తెలంగాణలో.. తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య కూడా మారనుంది.

    జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటర్లుగా ఉండే పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాజ్యసభ సభ్యులు కూడా జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పలువురు రాజ్యసభ సభ్యులు హైదరాబాద్‌లో ఓటర్లుగా ఉండటంతో వారు జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కొనసాగారు. అలాంటి వారిలో కేవీపీ రామచంద్రరావు,సీఎం రమేశ్, నందమూరి హరికృష్ణ, జైరాం రమేశ్ తదితరులున్నారు.

    అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారిలో ఉన్న కె. కేశవరావు, ఎంఏ ఖాన్, జైరాం రమేశ్, టి.సుబ్బిరామిరెడ్డి, చిరంజీవిలు జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఎంపిక కా వడంతో... తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు. అంటే.. వారు జీహెచ్‌ఎంసీలోఎక్స్‌అఫీషియో సభ్యులు కారు.

    కాగా, ప్రస్తుత లాటరీలో తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన కేవీపీ రామచంద్రరావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, సీఎం రమేశ్‌లు  ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వారు యథావిధిగా కొనసాగుతారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన పాల్వాయి గోవర్ధనరెడ్డి, గుండు సుధారాణి, గరికపాటి మోహనరావులు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా లేరు.

    వారు గ్రేటర్‌లో ఓటర్లుగా లేనందున వారి జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో ఎక్స్‌అ ఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎంపికైన  దేవేందర్‌గౌడ్ గ్రేటర్‌కు చెందిన వారైనప్పటికీ జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉండే అవకా శం లేదు.

    జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉండేవారు జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశాలకు హా జరై తమ వాణి వినిపించవచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంపికైన మిగతా రాజ్యసభ స భ్యులు రేణుకాచౌదరి, సుజనాచౌదరి, సీతారామలక్ష్మి, జేడీ శీ లంలు ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.
     

Advertisement
Advertisement