వేములవాడలో చైన్ స్నాచింగ్ | Sakshi
Sakshi News home page

వేములవాడలో చైన్ స్నాచింగ్

Published Sat, Apr 30 2016 3:10 PM

Chain snatching in Vemulawada

వేములవాడ అర్బన్ (కరీంనగర్ జిల్లా) :  వేములవాడలో ఓ ఆగంతకుడు మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయాడు. శనివారం మధ్యాహ్నం శ్యామల అనే మహిళ బుద్ధి పోచమ్మ వీధిలోని తన నివాసం నుంచి శివసాయినగర్‌లోని కుమార్తె నివాసానికి వెళ్లేందుకు బయల్దేరింది. నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ ఆగంతకుడు బైక్‌పై వచ్చి ఆమెను అటకాయించి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
Advertisement