ఇళ్ల స్కాంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్కాంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

Published Mon, Dec 1 2014 6:32 AM

CID to investigate the speed of those scam

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీఎత్తున చోటుచేసుకున్న బలహీనవర్గాల ఇళ్ల  కుంభకోణంపై మలిదశ దర్యాప్తుకు రాష్ట్ర సీఐడీ విభాగం సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయడానికి ఈ విభాగం దర్యాప్తు అధికారులు సన్నాహాలు  చేస్తున్నారు.  

దీనికి సంబంధించిన  కార్యాచరణకు సెలవుల నుంచి ఈనెల 5న తిరిగి రాగానే సీఐడీ ఐజీ చారుసిన్హా తుదిరూపం ఇవ్వనున్నారు.  9 జిల్లాలకు సంబంధించి 36 గ్రామాల్లో  తొలిదశ దర్యాప్తును పూర్తిచేసిన సీఐడీ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను కూడా అందజేశారు.

ప్రాథమిక దర్యాప్తులో దాదాపు 500లకు పైగా అక్రమార్కులు వెలుగు చూడగా, రూ.60 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేల్చారు.

Advertisement
Advertisement