కోల్ కారిడార్‌కు మోక్షం కలిగేనా? | Sakshi
Sakshi News home page

కోల్ కారిడార్‌కు మోక్షం కలిగేనా?

Published Mon, Jul 7 2014 1:55 AM

Coal Corridor Construction?

కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న అన్ని బొగ్గుగనుల మీదుగా రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి, చెల్పూరు(ఘన్‌పూర్), గోవిందరావుపేట (ములుగు), మణుగూరు వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం 1982లోనే రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అధికారులు దీనికి ‘కోల్ కారిడార్’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

2010లో అప్పటి పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ప్రతిపాదనను మరోసారి అప్పటి రైల్వేమంత్రి దృష్టికి తీసుకుపోగా.. సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం ఈ లైన్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. దీంతో రూ.10వేల కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. కోల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే అటవీ ప్రాంతాలైన మంథని, భూపాలపల్లికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.
 
ఆ రెండు లైన్లకు ఆమోదం లభించేనా?

జిల్లావాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడే విధంగా కరీంనగర్-హైదరాబాద్, కరీంనగర్ -హసన్‌పర్తి వరకు కొత్త లై న్ వేయాలని అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పలుమార్లు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ అవి ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు.
 
కనీస సౌకర్యాలు కలిగేనా?
జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. సౌకర్యాలపై అధికారులు సైతం శ్రద్ధ చూపడంలేదు. రామగుండం రైల్వేస్టేషన్‌లో రెండో వైపు కూడా టికె ట్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి వద్ద, కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం అత్యవసరం. గత డిసెంబర్‌లో రామగుండం రైల్వే ప్రధాన గేటు వద్ద కుప్పకూలిన బ్రిడ్జి నిర్మా ణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

జిల్లాలో పలు మార్గాల నిర్మాణం సగం వర కు పూర్తికావడంతో ఆయా ప్రాంతాల నుం చి సమీప ప్రాంతాలకు పుష్‌పుల్ రైలు నడపాలనే డిమాండ్ వస్తోంది. ప్రజా విజ్ఞప్తుల పై గత ఎంపీలు సైతం ఏకీభవించారు. కరీంనగర్ నుంచి మోర్తాడ్ వరకు రైలు మార్గం పూర్తయినందున కరీంనగర్, మెట్‌పల్లి మధ్య పుష్‌పుల్ రైలు నడపాలని కోరుతున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వర కు మరో రైలు నడపాల్సిన అవసరముంది.
 
సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆగేనా?
 చెన్నయ్ నుంచి ఢిల్లీ వెళ్లే గరీబ్థ్ ్రసూపర్‌ఫాస్ట్ రైలు నెల్లూరు (ఆంధ్రప్రదేశ్), చంద్రాపూర్ (మహారాష్ట్ర) మినహా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఆగదు. కనీసం రామగుండం, మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్‌ఫాస్ట్ రైలును పెద్దపల్లిలో నిలుపాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రామగుండంలో రైల్వేస్టేషన్‌లో నవ్‌జీవన్, జైపూర్, స్వర్ణజయంతి రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణికులు ఏళ్ల నుంచి కోరుతున్నారు.

Advertisement
Advertisement