కష్టకాలంలో ఐక్యంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో ఐక్యంగా ఉండాలి

Published Tue, Feb 21 2017 2:35 AM

Congress infighting continues as Digvijay Singh arrives in the State

కోమటిరెడ్డి సోదరులకు దిగ్విజయ్‌ సూచన
సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యా రు. రాష్ట్ర పర్యటనలో ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ ను హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌ లో కోమటిరెడ్డి సోదరులు కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యాఖ్యల నేపథ్యంలోనే దిగ్విజయ్‌తో వీరు సమావేశ మయ్యారు. టీపీసీసీ చేసిన సర్వే బోగస్‌ అని, ఉత్తమ్‌ గడ్డం పెంచుకుంటే అధికారం లోకి రాలేమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాలు, వాటికి దారి తీసిన కారణాలపై దిగ్విజయ్‌కు కోమటిరెడ్డి సోదరులు వివరణ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌ నియోజకవర్గంలో  2,300 ఓట్లతో కాంగ్రెస్‌ ఓడిందని, ఇటీవలే జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిం దని వివరించారు. అలాంటి నకిరేకల్‌లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని చేసిన సర్వేను మాత్రమే తప్పుబట్టామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఈ సర్వేతో  రాజ కీయంగా తమను దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. పార్టీపై, పార్టీ నిర్ణయాలపై, పార్టీ అధినేతపై అపారమైన విశ్వాసం ఉందని వెల్లడించారు. దీనిపై ఉత్తమ్‌తోనూ దిగ్విజయ్‌ చర్చించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను, పార్టీ అధ్యక్షుడిగా తనకు ఎదు రైన ఇబ్బందులను దిగ్విజయ్‌కు ఉత్తమ్‌ వివ రించినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని, ఈ సమయంలో నాయకుల మధ్య కలహాలు మంచివి కావని దిగ్విజయ్‌ వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకు లంతా ఐక్యంగా ఉండాలని, అభిప్రాయ భేదాలుంటే  పరిష్కరించుకోవాలన్నారు.

అంతర్గత వ్యవహారం: దిగ్విజయ్‌
పార్టీ నాయకుల మధ్య తలెత్తిన అంతర్గత అంశంపై వ్యాఖ్యానించాల్సిందేమీ లేదని దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తనను కలసిన మీడియా ప్రతినిధులతో ఆయన  మాటా ్లడుతూ ఇరువర్గాల వాదనలు విన్నామని, వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటా మన్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో ఉత్తమ్, కోమటిరెడ్డి మధ్య వివాదం ముగిసిన అధ్యాయమని, రాజీ కుదిరిందని జీవన్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement
Advertisement