కేసీఆర్... సెంటిమెంట్ రాజకీయాలు మానుకో | Sakshi
Sakshi News home page

కేసీఆర్... సెంటిమెంట్ రాజకీయాలు మానుకో

Published Tue, Aug 5 2014 1:23 PM

కేసీఆర్... సెంటిమెంట్ రాజకీయాలు మానుకో - Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. కరెంట్ కావాలని కోరిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమని అన్నారు. రైతులకు నిరంతరాయంగా ఏడు గంటల పాటు కరెంట్ అందిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో హమీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హమీని టీఆర్ఎస్ పార్టీ  గాలికి వదిలేసిందని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి రెండు గంటలు కరెంట్ కూడా అందడం లేదని... రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందజేయాలని వంశీచంద్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలో 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

పదేళ్ల కాంగ్రెస్ పాలనపై ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కలేదని వంశీచంద్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.  ఇకనైనా సెంటిమెంట్ రాజకీయాలు మానుకుని రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే వంశీచంద్ హితవు పలికారు.

Advertisement
Advertisement