రాష్ట్రంలో ఒక్కరోజే 352 మందికి కరోనా | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఒక్కరోజే 352 మందికి కరోనా

Published Thu, Jun 18 2020 10:02 PM

Corona Cases Rises To 6027 In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహ మ్మారి మరింతగా విజృంభిస్తోంది. గురువా రం ఒక్కరోజే ఏకంగా 352 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గురువారం నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 302 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌ జిల్లాలో 10, మంచిర్యాలలో 4, జనగామ, వరంగల్‌ అర్బన్‌లో 3, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కరోనాతో మరో ముగు ్గరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్‌ తో మృతిచెందిన వారి సంఖ్య 195కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,027 కేసులు నమోదు కాగా.. 3,031 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 2,531 మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌లో ఉన్నారు. 

ప్రైవేటు ల్యాబ్‌ పరీక్షలపై అస్పష్టత... 
ప్రస్తుతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసిన పరీక్షల ఫలితాలు మాత్రమేనని తెలుస్తోంది. ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, ఆ సమాచారాన్ని ఆయా యాజమాన్యా లు ప్రభుత్వానికి ఇవ్వడం లేదు.  సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ అయిన తర్వాత వివరాలను ఎంట్రీ చేస్తే ప్రైవేటు ల్యాబ్‌ల్లో జరిగిన పరీక్షలు, కేసుల వివరాలు అధికారులకు క్షణాల్లో అందే అవకాశముంటుందని విశ్వసనీయంగా తెలిసింది.  

హజ్‌హౌస్‌లో కలకలం 
హజ్‌హౌస్‌లో కరోనా కలకలం రేగింది. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ రిటైర్డ్‌ ఉద్యోగి కరోనాతో చనిపోయారు. ఆ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు కూడా రెండ్రోజుల క్రి తం అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో అందులో ఉన్న కార్యాలయాలన్నీ మూసివేసి శానిటైజేషన్‌ పనులు చేపట్టారు. 

ఒకే కుటుంబంలో 8 మందికి.. 
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో ఒకే కుటుంబంలోని 8 మందికి కరోనా సోకింది. ఈ నెల 15న సిద్ధిక్‌నగర్‌లో ఉంటున్న ఓ మహిళ (49) కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె కు టుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయగా.. మరో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయింది.   

Advertisement
Advertisement