సంస్కృతాన్ని ద్వితీయభాషగా కొనసాగించాలి

9 Mar, 2018 10:30 IST|Sakshi
డీఐఈఓకు వినతిపత్రం అందజేస్తున్న అధ్యాపకులు

సంస్కృత అధ్యాపకుల అసోసియేషన్‌ నాయకుల డిమాండ్‌

డీఐఈఓకు వినతిపత్రం అందజేత 

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌ అర్బన్‌): సంస్కృతంను ద్వితీయ భాషగా కొనసాగించే వరకూ స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ను బహిష్కరిస్తున్నామని సంస్కృత అధ్యాపకుల అసోసియేషన్‌ నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం జిల్లా ఇంటర్‌ విద్యాధికారి దాసరి ఒడ్డెన్నకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తాము గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్‌లో సంస్కృతంను ద్వితీయ భాషగా బోధిస్తూ జీవనాన్ని సాగిస్తున్నామన్నారు.

కానీ ఇటీవల కాలంలో ఇంటర్‌లో ద్వితీయ భాష సంస్కృతం విషయంలో తెలుగు తప్పనిసరి అని, ఫస్ట్‌క్లాస్‌ నుంచి ఇంటర్‌ వరకు తెలుగు ద్వితీయ భాషగా ఉంటుందని పేర్కొనడంతో తామంతా భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ అబధ్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కావున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంస్కృతం ద్వితీయ భాషగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసేవరకూ స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. 

మరిన్ని వార్తలు