సమస్యలు పరిష్కరించకుంటే రేషన్‌ బంద్‌ | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే రేషన్‌ బంద్‌

Published Sun, Jun 25 2017 2:27 AM

demands are not fulfilled, the ration shops will be closed from August

ప్రభుత్వానికి రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్‌: నామమాత్రపు కమీషన్లతో అనేక సమస్యలతో రేషన్‌ షాపులు నడుపుతున్నామని రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తొమ్మిది రకాల సరుకుల విక్రయం నుంచి రెండు సరుకులకే కుదించడంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని సంఘం తెలిపింది. ప్రభుత్వం ముందుంచిన తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఆగస్టు నుంచి రేషన్‌ షాపులను మూసివేస్తామని అల్టిమేటం జారీ చేసింది.

ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి తమ నిర్ణయాన్ని తెలిపామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించా లని, లేదంటే కనీసం రూ.30 వేల గౌరవ వేతనం చెల్లించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీలర్లను బ్యాంకింగ్‌ కార్పొరేట్‌ ఏజెంట్లుగా గుర్తించాలని, డీలర్లకు ప్రభుత్వ హెల్త్‌ కార్డులు ఇవ్వాలని సంఘం డిమాండ్‌ చేసింది.   మొత్తంగా 18 డిమాండ్లతో మంత్రి ఈటలకు ఒక వినతి పత్రాన్ని సమర్పించింది.

Advertisement
Advertisement